Krishna Vamsi : మరో రంగమార్తాండానా.. బాబోయ్..!

మురారి రీ రిలీజ్ టైం లో సోషల్ మీడియాలో కృష్ణవంశీ యాక్టివ్ గా ఉన్నారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా ఆన్సర్ ఇచ్చారు.

Published By: HashtagU Telugu Desk
Another Rangamarthanda Krishna Vamsi Shocking Response

Another Rangamarthanda Krishna Vamsi Shocking Response

కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన రంగమార్తాండ సినిమా (Rangamarthanda movie) లాస్ట్ ఇయర్ రిలీజై డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా విషయంలో కృష్ణవంశీ పడిన కష్టమంతా కూడా వృధా అయ్యింది. మరాఠి సినిమా నవ సామ్రాట్ ని రీమేక్ చేసిన కృష్ణవంశీ ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ని ప్రధాన పాత్రలుగా తీసుకుని తెరకెక్కించారు. ఐతే సినిమా కేవలం కొంతమందికి మాత్రమే నచ్చింది.

కమర్షియల్ గా సక్సెస్ అవని ఈ సినిమా గురించి కృష్ణవంశీ (Krishna Vamsi) రీసెంట్ గా ప్రస్తావించారు. మురారి రీ రిలీజ్ టైం లో సోషల్ మీడియాలో కృష్ణవంశీ యాక్టివ్ గా ఉన్నారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా ఆన్సర్ ఇచ్చారు. ఈ క్రమంలో ఒక నెటిజన్ రంగమార్తాండ సినిమా బాగుంటుంది. మళ్లీ అలాంటి సినిమా తీయండని అన్నాడు. అయితే దానికి ఆన్సర్ ఇచ్చిన కృష్ణవంశీ అది పెద్ద ఫ్లాప్ సినిమా సార్. మళ్లీ అలాంటి సినిమానా అంటూ దండం ఎమోజీ పెట్టాడు.

తను తీసిన సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు అంటే అది కచ్చితంగా వర్క్ అవుట్ కానట్టే లెక్క. అయితే రంగమార్తాండ సినిమాకు కృష్ణవంశీ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆయన అనుకున్నది ఒకటైతే సినిమా రిజల్ట్ వేరేలా వచ్చింది. ఐతే అలాంటి సినిమా మరోటి సార్ అనగానే బాబోయ్ వద్దండి అంటూ ఆన్సర్ ఇచ్చారు కృష్ణవంశీ.

ప్రస్తుతం మురారి రీ రిలీజ్ (Murari) హంగామాలో ఉన్న కృష్ణవంశీ ఆ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా చెబుతున్నారు. ఇక ఈ చాట్ లో భాగంగానే సీక్వెల్ ఎలా తీస్తారో తనకు అర్ధం కాదని చెప్పి షాక్ ఇచ్చారు కృష్ణవంశీ. ఐతే ఇది ఆయన సొంత ఉద్దేశం కాగా దీనిపై కూడా కృష్ణవంశీ ఎవరి మీదనో పంచ్ వేశారంటూ రకరకాలుగా వార్తలు రాస్తున్నారు.

Also Read : Karthi : అన్న సినిమాలో తమ్ముడు.. సీక్రెట్ గా ఉంచాల్సింది కానీ..?

  Last Updated: 22 Jul 2024, 11:35 PM IST