సినీ ప్రియులంతా థియేటర్లకు వెళ్లడం మానేసి ఓటీటీలో సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. టికెట్లు రేట్లు అధికం అవ్వడం మల్టీ ప్లెక్స్ లోకి వెళ్తే సినిమా టికెట్ రేటు మోతతో పాటుగా తినుబండారాల ఖర్చు అధికమవడం వల్ల సామాన్యుడి జేబుకి చిల్లు పడుతుంది. అందుకే ఓటీటీలు సూపర్ గా క్యాష్ చేసుకుంటున్నాయి. స్టార్ సినిమాల ఓటీటీ బిజినెస్ కూడా కలెక్షన్స్ లెక్కల్లో కలుపుతున్నారంటే వాటి రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
ఐతే ఈ ఓటీటీలు ఒక అకౌంట్ తీసుకుని ఇద్దరు ముగ్గురికి పాస్ వర్డ్ షేరింగ్ చేసుకుంటున్నారు. నెట్ ఫ్లిక్స్ (Netflix) టీం పాస్ వర్డ్ షేరింగ్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంది. అందుకే వారి సబ్ స్క్రైబర్స్ ఇక మీదట పాస్ వర్డ్ షేరింగ్ చేసుకునే ఛాన్స్ లేదు. వారు ఏదైతే ప్లాన్ తో ఎంతమంది కింద ప్లాన్ ఉంటుందో వారు తప్ప మిగతా వారికి పాస్ వర్డ్ షేర్ చేసే అవకాశం లేదు. ఒకవేళ చేసినా అది వర్క్ అవుట్ అవ్వదు.
ఐతే నెట్ ఫ్లిక్స్ దారిలోనే ఇప్పుడు డిస్నీ + హాట్ స్టార్ (Disney + Hotstar) కూడా పాస్ వర్డ్ షేరింగ్ మీద ఆంక్షలు విధిస్తుంది. సెప్టెంబర్ నుంచి వారు ఏదైతే ప్లాన్ తీసుకుని దాని పరిధిలో వచ్చే వారికి తప్ప మిగతా వారికి ఈ పాస్ వర్డ్ షేరింగ్ అనేది ఉండే ఛాన్స్ లేదు. సెప్టెంబర్ నుంచి ఇది కచ్చితంగా అప్లై చేసేలా చూస్తున్నారు.
ఐతే ఓటీటీలు ఇలా తమ సబ్ స్క్రిప్షన్ రేటు పెంచడం లేదా పాస్ వర్డ్ ఆంక్షలు పెట్టడం వల్ల ఐబొమ్మ లాంటి వాటిని సినీ ప్రేక్సకులు ఆశ్రయిస్తున్నారు. ఓటీటీల కన్నా వాటి నుంచి సినిమాను చూసే ప్రేక్షకులే ఎక్కువమంది ఉంటారు. అయినా సరే ఓటీటీ సంస్థలు వాటి మీద సరైన యాక్షన్ తీసుకోలేకపోతున్నారు.