Site icon HashtagU Telugu

NTR : ఇండస్ట్రీకి మరో ఎన్టీఆర్ రాబోతున్నాడు.. నందమూరి ఫ్యామిలీ నుంచి లాంచింగ్ రెడీ..!

Another Ntr Coming As Hero From Nandamuri Family

Another Ntr Coming As Hero From Nandamuri Family

NTR నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. త్వరలో నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రం ఉంటుందని తెలుస్తుండగా అతనికన్నా ముందే మరో నందమూరి హీరో సినిమాల్లోకి వస్తున్నాడు. అంతేకాదు వచ్చే హీరో పేరు కూడా నందమూరి తారక రామారావే అంటే ఎన్టీఆర్ అన్నమాట. ఇంతకీ వచ్చేది ఎవరు అంటే హరికృష్ణ పెద్ద కొడుకు నందమూరి జానకిరాం పెద్ద కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతని పేరు కూడా ఎన్టీఆర్ కావడం విశేషం.

సీనియర్ ఎన్.టి.ఆర్ తర్వాత ఆయన పేరుతో జూనియర్ ఎన్టీఆర్ అదరగొట్టేస్తున్నాడు. తన నట విశ్వరూపంలో తాతకు తగ్గ మనవడు అనిపిస్తున్నాడు. ఇక ఇప్పుడు అదే ఎన్టీఆర్ పేరుతో మరో హీఓరో అదే ఫ్యామిలీ నుంచి రాబోతున్నాడు. నందమూరి జానకిరాం తనయుడు ఎన్టీఆర్ హీరోగా వైవిఎస్ చౌదరి డైరెక్షన్ లో త్వరలో సినిమా మొదలు కాబోతుందని తెలుస్తుంది. వైవిఎస్ చౌదరి ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మెగా ఫోన్ పట్టుకుంటున్న ఈ సినిమా ఒక లవ్ స్టోరీగా రాబోతుందని తెలుస్తుంది.

మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని కొనేళ్లుగా ఎదురుచూస్తున్న నందమూరి ఫ్యాన్స్ కి మరో నందమూరి హీరో అదే ఎన్టీఆర్ తెరంగేట్రమని తెలిసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మరి ఈ నవ యువ ఎన్టీఆర్ కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి. మోక్షజ్ఞ మొదటి సినిమా డైరెక్షన్ ఛాన్స్ బోయపాటి శ్రీనుకి ఇచ్చారని లేటెస్ట్ టాక్. మోక్షజ్ఞ రాకకోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

Also Read : Samantha : పుష్ప 2లో సమంత కానీ అందుకు కాదా.. సుకుమార్ ప్లాన్ ఏంటో..?