Dulquer Salman Lucky Bhaskar సార్ తర్వాత వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వస్తున్న సినిమా లక్కీ భాస్కర్. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ మూవీస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మరో లక్కీ హీరోయిన్ కూడా నటిస్తుందని తెలుస్తుంది.
లక్కీ భాస్కర్ కి ఒక హీరోయిన్ సరిపోదని మరో హీరోయిన్ ని కూడా తీసుకుంటున్నారట. ఆ లక్కీ గాళ్ ఎవరో కాదు బిగ్ బాస్ 17 లో సందడి చేసిన అయేషా ఖాన్ అని తెలుస్తుంది. ఇప్పటికే అమ్మడు విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఓం భీం బుష్ సినిమాలను రిజెక్ట్ చేసిన అమ్మడు ఫైనల్ గా లక్కీ భాస్కర్ ఆఫర్ ని ఓకే చేసింది.
ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే లక్కీ భాస్కర్ సినిమాపై బజ్ పెంచారు మేకర్స్. ఈ సినిమా తెలుగుతో పాటుగా సౌత్ అన్ని భాషల్లో రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. సినిమాకు సంబందించిన రిలీజ్ అప్డేట్ ఇంకా బయటకు రాలేదు. తెలుగులో మహానటి, సీతారామం రెండు సినిమాలతో సూపర్ హిట్లు కొట్టిన దుల్కర్ సల్మాన్ నుంచి వస్తున్న ఈ సినిమా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పొచ్చు.