Ram Charan: సీఈఓ సినిమా నుంచి మరో లీక్.. సరికొత్త లుక్ లో రామ్ చరణ్?

ఈ మధ్యకాలంలో సినిమాల లీకుల బెడద అన్నది దర్శకనిర్మాతలకు పెద్ద సమస్యగా మారిపోయింది. ఎంత పకడ్బందీగా షూటింగ్ చేస్తున్న కూడా సినిమాలకు సంబంధించిన ఫోటోలు ఏదో రకంగా సోషల్ మీడియాలో బయటకు వస్తూనే ఉన్నాయి.

Published By: HashtagU Telugu Desk
Ramcharan And Family

Ramcharan And Family

Ram Charan: ఈ మధ్యకాలంలో సినిమాల లీకుల బెడద అన్నది దర్శకనిర్మాతలకు పెద్ద సమస్యగా మారిపోయింది. ఎంత పకడ్బందీగా షూటింగ్ చేస్తున్న కూడా సినిమాలకు సంబంధించిన ఫోటోలు ఏదో రకంగా సోషల్ మీడియాలో బయటకు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే గతంలో ఈ సినిమా నుంచి కొన్ని లీకులు విడుదలైన విషయం తెలిసిందే..

దర్శకుడు శంకర్ నిర్మాత దిల్ రాజు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక రకంగా ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి ఈ సినిమా నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ఆ ఫోటోలు మరెవరో కాదు హీరో రామ్ చరణ్ వే. అందులో రామ్ చరణ్ హెయిర్ స్టైల్, మెడలో ఒక నల్లటి తాడుతో డైనమిక్ లుక్ లో కనిపిస్తున్నాడు. అంతేకాకుండా కళ్ళకు కాటుక పెట్టుకుని చూడడానికి ఒక ముస్లిం లాగా కనిపిస్తున్నాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు ఆ ఫోటోని తెగ వైరల్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తికాగా మిగిలి బాగానే శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే నిర్మాత దిల్ రాజు తన కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చెర్రీ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

  Last Updated: 23 Mar 2023, 09:56 PM IST