Site icon HashtagU Telugu

Rajamouli-Mahesh: రాజమౌళి, మహేశ్ మూవీ నుంచి మరో కీలక అప్డేట్.. షూటింగ్ ఎప్పుడంటే

Mahesh Rajamouli Budget Locked

Mahesh Rajamouli Budget Locked

Rajamouli-Mahesh: అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తన తదుపరి చిత్రం కోసం భారీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ఫారెస్ట్ అడ్వెంచర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఇండియన్ సినిమాగా కాకుండా సరైన ఇంటర్నేషనల్ మూవీగా తెరకెక్కించే యోచనలో రాజమౌళి ఉన్నారు. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు పలు అగ్రశ్రేణి హాలీవుడ్ స్టూడియోలు సహనిర్మాతలుగా చేరేందుకు రేసులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ డీల్ ను ఖరారు చేస్తున్న రాజమౌళి త్వరలోనే ఈ సినిమాను అనౌన్స్ చేయనున్నారు. అగ్ర దర్శకుడికి చాలా ఆప్షన్స్ ఉన్నాయని, ప్రస్తుతం ఫైనాన్షియల్స్, డీల్స్ ఫైనలైజ్ చేస్తున్నాడని అంటున్నారు.

ఈ సినిమాను కూడా వివిధ దేశాల్లో షూట్ చేయాల్సి ఉందని, అందుకోసం రాజమౌళి లొకేషన్లను అన్వేషిస్తున్నారని సమాచారం. మరోపక్క మహేష్ బాబు తన పాత్రకు కావాల్సిన లుక్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. జూన్ లో షూటింగ్ ఫార్మాలిటీస్ స్టార్ట్ అవుతాయని, షూటింగ్ ప్రారంభానికి ముందే రాజమౌళి సినిమా గురించి ప్రకటిస్తారని సమాచారం. కె.ఎల్.నారాయణ నిర్మాత. ఈ రేసీ అండ్ స్టైలిష్ ఫారెస్ట్ అడ్వెంచర్ కు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.