Yash Taxic కె.జి.ఎఫ్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న యశ్ తన నెక్స్ట్ సినిమా టాక్సిక్ (Yash Taxic) తో రాబోతున్నాడు. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో యశ్ సరసన ఇప్పటికే బాలీవుడ్ అందాల భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఐతే ఈ సినిమాలో మరో హీరోయిన్ కు ఛాన్స్ ఉండగా ఆమెను కూడా ఎంపిక చేశారని తెలుస్తుంది. బాలీవుడ్ లో తన అందంతో మెప్పిస్తున్న తారా సుతారియా (Tara Sutaria) ను యశ్ టాక్సిక్ కోసం సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.
కియరా, తారా సుతారియా ఈ ఇద్దరు టాక్సిక్ లో భాగం అవుతున్నారు. ఇప్పటికే సినిమాలో హ్యూమా ఖురేషి కూడా ఉందని వార్తలు వచ్చాయి. సినిమాలో ఆమె నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నట్టు తెలుస్తుంది. యశ్ టాక్సిక్ సినిమా 1950-70 కాలంలో జరిగే డ్రగ్ మాఫియా కథాంశం తో వస్తుంది. ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో తన సత్తా చాటాలని చూస్తున్నాడు యశ్.
కె.జి.ఎఫ్ బంపర్ హిట్ కొట్టాక యశ్ ఆ సినిమా తర్వాత నెక్స్ట్ దాన్ని మించే ప్రాజెక్ట్ చేయాలనే ఇన్నాళ్లు వెయిట్ చేశాడు. టాక్సిక్ సినిమాను గీతు మోహన్ దాస్ (Geethu Mohandass) డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు భారీ షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న ఈ సినిమా అనుకున్న విధంగా షూటింగ్ పూర్తి చేసి 2025 సమ్మర్ కి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. యశ్ టాక్సిక్ మీద ఆడియన్స్ అంచనాలు కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి.
సినిమా కె.జి.ఎఫ్ రికార్డులను బద్ధలు కొట్టేలా మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గురించి వచ్చే ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది.
Also Read : Mass Ka Dass : ఆ గట్స్ విశ్వక్ సేన్ కి మాత్రమే ఉన్నాయి..!