సీతారామం తర్వాత హను రాఘవపుడి తన నెక్స్ట్ సినిమా ప్రభాస్ తో ఫిక్స్ చేసుకున్నాడు. ఫౌజి అనే టైటిల్ ప్రచారం లో ఉన్న ఈ సినిమా ఇండిపెండెన్స్ ముందు కథతో రాబోతుంది. హను రాఘవపుడి డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులో షూటింగ్ జరుపుకుంటున్న ఫౌజి సినిమా షూటింగ్ లో ప్రభాస్ (Prabhas) జనవరి నుంచి జాయిన్ అవుతాడని తెలుస్తుంది.
ప్రభాస్ ఫౌజి (Fouji) సినిమాలో ఇమాన్వి (Imanvi) ఇస్మాయిల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. సోషల్ మీడియాలో తన డ్యాన్స్ తో ఫాలోవర్స్ ని పెంచుకుంటూ వచ్చిన ఇమాన్వి ప్రభాస్ సినిమాలో హీరోయిన్ అనగానే అమ్మడి రేంజ్ మరింత పెరిగింది. ఐతే ఈ సినిమాలో హను ఒక హీరోయిన్ తో సరిపెట్టేలా కనిపించట్లేదు.
ఇమాన్వి కాకుండా మరో హీరోయిన్..
సినిమాలో ఇమాన్వి కాకుండా మరో హీరోయిన్ ను కూడా తీసుకోవాలని అనుకుంటున్నాడట. సినిమా కథ ప్రకారం మరో కథానాయిక అవసరం ఉందని టాక్. ఆ ఛాన్స్ ను తనకు సీతారామం లాంటి సూపర్ హిట్ సినిమాలో భాగమైన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ని తీసుకోవాలని ఉందట.
అసలైతే ప్రభాస్ ఫౌజిలో ముందు మృణాల్ నే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె బదులుగా ఇమాన్వి వచ్చి చేరింది. ఐతే ఇమాన్వి ఉన్నా కూడా మృణాల్ కూడా ఈ సినిమాలో భాగం అవుతుందని టాక్. సో సీతారామం సెంటిమెంట్ ని రిపీట్ చేస్తూ మరో సూపర్ హిట్ కొట్టాలని భారీ ప్లాన్ చేసాడు హను రాఘవపుడి.
Also Read : Keerthy Suresh : కల్కి లో కీర్తి రిజెక్ట్ చేసిన పాత్ర ఏది..?