Devi Sri Prasad: రాక్‌స్టార్‌ దేవీ ఖాతాలో మరో ఫిలింఫేర్‌ అవార్డు!

ఇటీవల ఫిలీం ఫేర్ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అవార్డుల విషయంలోనూ తగ్గెదే లే అంటూ పుష్ప

Published By: HashtagU Telugu Desk
Devi

Devi

ఇటీవల ఫిలీం ఫేర్ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అవార్డుల విషయంలోనూ తగ్గెదే లే అంటూ పుష్ప సినిమా ఇతర సినిమాల కంటే ఎక్కువ అవార్డులను కైవసం చేసుకుంది. కాాగా రాక్‌స్టార్‌ దేవీ శ్రీ ప్రసాద్‌ ఖాతాలో మరో ఫిలింఫేర్‌ అవార్డు చేరింది. ఆయన స్వరాలు సమకూర్చిన ‘పుష్ప- ద రైజ్‌’ చిత్రం బెస్ట్‌ మ్యూజిక్‌ ఆల్బంగా ఎంపికైంది. ఆ ఆనందాన్ని పంచుకుంటూ ఇప్పటికే తీసుకున్న 9 అవార్డులకు.. తన 10వ అవార్డు జతచేసి దేవిశ్రీ ఇలా ఫొటోకు పోజిచ్చారు. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కబోయే పుష్ప-2 మూవీకి దేవీ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప పార్ట్ 1 మూవీకి మించేలా సంగీతం ఇవ్వబోతున్నాడు.

  Last Updated: 12 Oct 2022, 05:21 PM IST