Site icon HashtagU Telugu

Sonakshi Sinha: పెళ్లి కళ వచ్చేసిందే బాలా!

Sonakshi

Sonakshi

బాలీవుడ్ లో పెళ్లి భాజాలు మొగుతున్నాయి. మొన్న టాలీవుడ్ మల్లీశ్వరి కత్రినా తన ప్రియుడు విక్కినీ పెళ్లడగా, నిన్న అందాల బ్యూటీ అలియా రణబీర్ పెళ్లి చేసుకుంది. తాజాగా మరో బాలీవుడ్  బ్యూటీ పెళ్లికి సిద్ధమైంది. దబాంగ్ ఫేం సోనాక్షి సిన్హా తన ఇన్ స్టాలో ఆసక్తికరమైన ఫొటోను షేర్ చేసింది. సోనాక్షి మనసారా నవ్వుతూ.. తన వెలుకు ఉన్న డైమాండ్ రింగ్ తో ఫొజులచ్చింది. అటు సోనాక్షి ఫ్యాన్స్, ఇటు బాలీవుడ్ నటులు రూమర్స్ అంటూ కామెంట్స్ చేశారు.

కానీ సోనాక్షి “నాకు ఇది మరిచిపోలేని రోజు!! నాకున్న అతి పెద్ద కలలో ఒకటి నిజం కాబోతోంది. నేను నమ్మలేకపోతున్ను. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నా’’ అంటూ రియాక్ట్ అయ్యింది. కొన్నాళ్లుగా నటుడు జహీర్ ఇక్బాల్ తో డేటింగ్ లో ఉంది సోనాక్షి. ఇప్పుడు అతడ్నే పెళ్లి చేసుకోబోతోంది. మరో ముఖ్యమైన సందర్భం చూసుకొని, అతడితో ఎంగేజ్ మెంట్ పూర్తయిందనే విషయాన్ని ఆమె బయటపెట్టబోతోంది. ఇదే కనుక నిజమైతే.. త్వరలోనే బాలీవుడ్ లో మళ్లీ పెళ్లి భాజాలు మోగనున్నాయి.