Yash Toxic : యష్ టాక్సిక్ లో మరో బాలీవుడ్ హీరోయిన్..?

Yash Toxic కె.జి.ఎఫ్ తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న యష్ తన నెక్స్ట్ సినిమా కోసం చాలా టైం తీసుకున్నాడనే చెప్పొచ్చు. కె.జి.ఎఫ్ తర్వాత యష్ చేస్తున్న సినిమా టాక్సిక్.

  • Written By:
  • Publish Date - May 23, 2024 / 12:08 PM IST

Yash Toxic కె.జి.ఎఫ్ తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న యష్ తన నెక్స్ట్ సినిమా కోసం చాలా టైం తీసుకున్నాడనే చెప్పొచ్చు. కె.జి.ఎఫ్ తర్వాత యష్ చేస్తున్న సినిమా టాక్సిక్. ఈ సినిమాను గీతు మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తున్నారు. మాఫియా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ లో నిర్మితమవుతుంది. ఈ సినిమాలో ఇప్పటికే కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుండగా లేటెస్ట్ గా మరో బాలీవుడ్ భామని సినిమాకి ఓకే చేశారని టాక్.

ఇంతకీ యష్ టాక్సిక్ లో నటించే మరో భామ ఎవరంటే బాలీవుడ్ భామ హుమా ఖురేషి అని తెలుస్తుంది. టాక్సిక్ లో యష్ సిస్టర్ రోల్ కి ముందు నయనతారని అనుకున్నారు. కానీ నయన్ ఆ ఆఫర్ ను కాదనేసింది. సినిమాలో సిస్టర్ పాత్రే అని తీసిపారేయడానికి లేదు ఆ పాత్ర హీరోకి ఈక్వల్ గా ఉంటుందట. అందుకే ఆ రోల్ లో నయన్ అయితే బాగుంటుందని అనుకున్నారు.

నయనతార రిజెక్ట్ చేయడంతో ఆ పాత్రలో హుమా ఖురేషిని లాక్ చేశారని తెలుస్తుంది. సినిమాలో నటించేందుకు హుమా భారీ డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ఆల్ర్డీ హిందీతో పాటు సౌత్ సినిమాల్లో కూడా నటిస్తున్న హుమా ఖురేషి యష్ టాక్సిక్ మరో హైలెట్ అవుతుందని అంటున్నారు.

కె.జి.ఎఫ్ తో కన్నడలో రికార్డులు సృష్టించిన యష్ నేషనల్ వైడ్ గా భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు. యష్ టాక్సిక్ మీద కూడా అదే రేంజ్ అంచనాలు ఉన్నాయి. అయితే వాటిని సినిమా అందుకునేందుకే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.

Also Read : Pushpa 2 Sooseki Song Promo : సూసేకి అగ్గిపుల్ల మాదిరి.. శ్రీవల్లి సాంగ్ ప్రోమో..!