Site icon HashtagU Telugu

NTR Devara : ఎన్టీఆర్ దేవరలో మరో బాలీవుడ్ భామ.. కొరటాల శివ ప్లానింగ్ అదుర్స్..!

Devara Movie Koratala Siva Shocking Remuneration

Devara Movie Koratala Siva Shocking Remuneration

NTR Devara యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర మొదటి భాగం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. RRR తర్వాత తారక్ చేస్తున్న సినిమాగా ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉండగా వాటికి తగినట్టుగా సినిమా తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. ఆచార్య ఫ్లాప్ తర్వాత తన సత్తా చాటాలని తన ఫుల్ ఎఫర్ట్స్ తో ఈ మూవీ చేస్తున్నాడు. దేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఆల్రెడీ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వి కపూర్ ఒక హీరోయిన్ గా చేస్తుంది.

దేవర లో సెకండ్ హీరోయిన్ గా మరాఠి భామ శృతిని తీసుకున్నారని తెలుస్తుంది. అయితే సినిమాలో మరో బాలీవుడ్ భామ నటించబోతుందని లేటెస్ట్ టాక్. సాహో బ్యూటీ శ్రద్ధ కపూర్ కూడా దేవరలో భాగం అవుతుందని తెలుస్తుంది. సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో ఆమె నటిస్తుందని తెలుస్తుంది. సో ఇలా చూస్తే దేవరలో ఒకరు ఇద్దరు కాదు ముగ్గురు భామలు హీరోయిన్స్ గా చేస్తున్నారని చెప్పొచ్చు.

Shraddha Kapoor

దేవర విషయంలో ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో ఉన్నాడు. ఈ సినిమా అక్టోబర్ 10న దసరా కానుకగా రాబోతుంది. సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ ని షేక్ చేయాలని ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యాడు. ఫ్యాన్స్ కూడా దేవర పై భారీ అంచనాలతో ఉన్నారు. ఎన్టీఆర్ కొరటాల శివ ఆల్రెడీ జనతా గ్యారేజ్ తో హిట్ అందుకున్నారు. ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నారు.

ఈ సినిమాతో పాటుగా ఎన్టీఆర్ వార్ 2 లో కూడా నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో తారక్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడని తెలిసిందే. సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.

Also Read : Mahesh Babu : మహేష్ 8 డిఫరెంట్ లుక్స్.. SSRMB లేటెస్ట్ క్రేజీ అప్డేట్..!