Site icon HashtagU Telugu

NTR Devara : దేవర కోసం మరో విలన్.. కొరటాల ప్లానింగ్ అదుర్స్..?

Is NTR Triple Role in Devara

Is NTR Triple Role in Devara

NTR Devara యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమా సెప్టెంబర్ నెల చివర్లో రాబోతుంది. ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా చేస్తున్నాడు కొరటాల శివ. దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారని తెలిసిందే. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇక ఇప్పటికే దేవర సినిమా కోసం సైఫ్ అలి ఖాన్ ని విలన్ గా తీసుకోగా మరో విలన్ గా బాబీ డియోల్ (Bobby Deol) ని కూడా తీసుకుంటున్నారని తెలుస్తుంది. యానిమల్ సినిమాతో బాబీ డియోల్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఒకప్పుడు హీరోగా బాలీవుడ్ లో సినిమాలు చేసిన బాబీ డియోల్ ఆ తర్వాత పెద్దగా ఫాం కొనసాగించలేదు. ఐతే సందీప్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ సినిమా తో విలన్ గా అదరగొట్టాడు బాబీ.

ఆ సినిమాలో అతని యాక్టింగ్ చూసిన మేకర్స్ ఆయనకు మరిన్ని అవకాశాలు అందిస్తున్నారు. బాబీ డియోల్ ఇప్పటికే సూర్య కంగువలో నటిస్తుండగా బాలకృష్ణ కె ఎస్ బాబీ కాంబో సినిమాలో కూడా విలన్ గా చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సినిమాలో కూడా ఛాన్స్ అందుకున్నాడని తెలుస్తుంది.

దేవర పార్ట్ 1 (Devara 1) లో సైఫ్ అలి ఖాన్ విలనిజం చూపిస్తే.. పార్ట్ 1 ఎండింగ్ లో బాబీ డియోల్ ఎంట్రీ ఇస్తాడట. ఇక దేవర 2 లో అతని ప్రతినాయక విశ్వరూపం చూపిస్తాడని తెలుస్తుంది. దేవరలో సైఫ్, బాబీ ఇద్దరు బాలీవుడ్ విలన్లు నటించడంతో సినిమాపై అంచనాలు డబుల్ అయ్యాయి. RRR తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న తారక్ దేవరతో మరోసారి అదరగొట్టాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమా రేంజ్ ఏంటన్నది చూడాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

Also Read : Rajamouli Mahesh Movie Title : మహేష్ కి పర్ఫెక్ట్ టైటిల్.. రాజమౌళి ప్లాన్ అంటే అలానే ఉంటుందిగా..?