అఖండ 2 మూవీ విషయంలో అభిమానులకు రోజుకో షాక్ తగులుతుంది. మొన్నటి వరకు రిలీజ్ విషయంలో టెన్షన్ పడగా…రేపు రిలీజ్ (డిసెంబర్ 12) అవుతుందని అధికారిక ప్రకటన రావడం తో ఊపిరి పీల్చుకున్నారు. ఈ లోపే మరో టెన్షన్ మొదలైంది. సినిమా ప్రీమియర్ షోల టికెట్ల ధరల పెంపునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం (TG) ఇచ్చిన జీవోను రాష్ట్ర హైకోర్టు తాజాగా సస్పెండ్ చేసింది. అధిక టికెట్ ధరల ద్వారా అదనపు ఆదాయం పొందాలని భావించిన చిత్ర నిర్మాతలఆశలకు గండికొట్టింది. సాధారణంగా పెద్ద సినిమాలకు అదనపు షోలు, పెంచిన ధరలు అనుమతించడం ద్వారా, బడ్జెట్‌ను త్వరగా రికవర్ చేసుకోవాలని నిర్మాతలు ప్రయత్నిస్తారు. కానీ కోర్టు జోక్యం కారణంగా ఆ అవకాశం వారికి తాత్కాలికంగా దూరమైంది. ఈ నిర్ణయం, సినిమా పరిశ్రమలో టికెట్ ధరల నియంత్రణపై చర్చకు మరోసారి తెరలేపింది.
T20 World Cup Tickets: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026.. టికెట్ల విక్రయం ప్రారంభం!
ఈ హైకోర్టు నిర్ణయం తర్వాత ఇప్పటికే ప్రీమియర్ షోల కోసం పెంచిన ధరలకు టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకుల పరిస్థితిపై ఇంకా స్పష్టత కొరవడింది. కోర్టు సస్పెన్షన్ నేపథ్యంలో ఆ టికెట్లను కొనుగోలు చేసిన వారికి అదనపు మొత్తం రిఫండ్ చేయబడుతుందా లేదా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. సాధారణంగా, ఇటువంటి సందర్భాలలో టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లు లేదా థియేటర్ యాజమాన్యాలు రిఫండ్ విధానాన్ని ప్రకటిస్తాయి. అయితే ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోవడంతో అధిక ధర చెల్లించిన ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై నిర్మాత లేదా పంపిణీదారులు వెంటనే స్పష్టతనిస్తే, అభిమానుల్లో నెలకొన్న సందిగ్ధత తొలగిపోయి, సినిమా విడుదలకు మార్గం మరింత సుగమం అవుతుంది.
