Rajamouli Mahesh గుంటూరు కారం తర్వాత మహేష్ రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమా కోసం జర్మనీ వెళ్లి అక్కడ ఏర్పాట్లు చురూ చేస్తున్నారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో భారీ యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాను కె.ఎల్ నారాయణ 300 కోట్ల పైన బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తుంది.
We’re now on WhatsApp : Click to Join
ఈ సినిమాలో మిగతా కాస్టింగ్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి న్యూస్ రాలేదు. అయితే రాజమౌళి మహేష్ సినిమాలో మరో స్టార్ నటిస్తున్నాడని టాక్. అతనెవరో కాదు మన టాలీవుడ్ కింగ్ నాగార్జున అని అంటున్నారు. స్టార్ ఇమేజ్ లేకుండా సరైన క్యారెక్టర్ ఇస్తే ఎలాంటి సినిమాలో అయినా నటించే సత్తా ఉన్న నటుడు నాగార్జున. ఆయన స్టార్ ఇమేజ్ ని పక్కన పెట్టి చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి.
అన్నమయ్య, శిరిడీ సాయి, ఊపిరి అలా వచ్చినవే. నటుడిగా తనని తాను మెప్పిస్తూ వచ్చిన నాగార్జున ఓ పక్క కమర్షియల్ సినిమాల్లో కూడా తన మాస్ స్టామినా చూపిస్తున్నాడు. ఈ సంక్రాంతికి నా సామిరంగ తో వచ్చి అలరించాడు నాగార్జున. ఇప్పుడు రాజమౌళి మహేష్ సినిమాలో భాగం అవుతున్నాడని తెలుస్తుంది.
రాజమౌళి సెలెక్ట్ చేస్తున్నాడు అంటే ఆ పాత్ర ఎంత బలంగా ఉంటుందో చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క నటుడికి రాజమౌళి సినిమాలో నటించాలని ఉంటుంది. మరి నాగార్జున కూడా మహేష్ 29 లో భాగం అవుతున్నాడని తెలిసి అంచనాలు రెట్టింపు అయ్యాయి. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.
Also Read : Pushpa 2 Satellite Rights : స్టార్ మా చేతికే పుష్ప 2.. అదిరిపోయే రేటుకి భారీ డీల్..!