Site icon HashtagU Telugu

Vyra Entertainments : మట్కా నిర్మాతకు మరో భారీ దెబ్బ..

Varun Tej Matka Review & Rating

Varun Tej Matka Review & Rating

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varuntej) నటించిన మట్కా మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయినా సంగతి తెలిసిందే. కెరీర్ మొదట్లోనే ప్రయోగాత్మక చిత్రాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పర్చుకున్న వరుణ్.. ఆ తర్వాత ఎందుకో సరైన హిట్ మాత్రం కొట్టలేకపోయాడు. రీసెంట్ గా మట్కా (Matka ) అంటూ ఓ డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ లో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి , నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించగా… జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. నవంబర్ 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మొదటి ఆట తోనే డిజాస్టర్ సొంతం చేసుకొని..రెండో రోజే థియేటర్స్ నుండి వెళ్ళిపోయింది. ఈ సినిమాను వైరా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ (Vyra Entertainments) వారు నిర్మించగా భారీ నష్టం వాటిల్లింది. ఈ సినిమా ఇచ్చిన షాక్‌లో నిర్మాత ఉంటే, సొంత సంస్థ‌లో CEO చేసిన స్కామ్ ఆయన్ను భారీ దెబ్బ తీసింది.

వైరా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ రూపొందించిన సినిమా ‘మ‌ట్కా’. ఈ సంస్థ సీఈఓ దాదాపు రూ.5.5 కోట్ల స్కామ్ కు పాల్ప‌డ్డాడ‌ని తెలుస్తోంది. ఓచ‌ర్ల‌ను తారుమారు చేయ‌డం, దొంగ లెక్క‌లు చూపించ‌డం, క‌మీష‌న్లు నొక్కేయ‌డం.. ఇలా చేయాల్సిన ఘ‌న‌కార్యాల‌న్నీ చేసి, దాదాపు రూ.5.5 కోట్లు వెన‌కేశాడ‌ని తెలుస్తోంది. వైరాలో తెర‌కెక్కించిన ‘హాయ్ నాన్న‌’కూ ఈయ‌నే సీఈఓ. సంస్థ నుంచి నెల‌కు దాదాపు రూ.2.5 ల‌క్ష‌ల జీతం అందుకొంటున్నారీయ‌న‌. అంతేకాదు… సొంత ఇన్నోవా కార్ల‌ని సంస్థ‌లో అద్దెకు తిప్పుతూ మ‌రో రెండు ల‌క్ష‌లు గ‌డిస్తున్నారు. నిర్మాత ఈ CEO ను న‌మ్మి… సినిమా బాధ్య‌త అంతా ఆయ‌న నెత్తిమీద వేస్తే, ఇదే అదునుగా రూ.5.5 కోట్లు వెన‌కేసేశాడు. సినిమా మ‌రో వారం రోజుల్లో విడుద‌ల అవుతోంద‌న‌గా… సీఈఓ వ్య‌వ‌హారం నిర్మాతకు తెలిసింది. దాంతో ఒక్క‌సారి ఆయ‌న ఎకౌంట్స్ క్రాస్ చెక్ చేయ‌డంతో, ఈ స్కామ్ బ‌య‌ట‌ప‌డింది. ప్ర‌స్తుతం ఈసీఓని ఆఫీసుకు రావొద్ద‌ని హుకూం జారీ చేశారు. దీనిపై పూర్తీ దర్యాప్తు చేస్తున్నారు.

Read Also : MP Seat : నాగబాబు కు ఎంపీ పోస్ట్ ఫిక్స్..?