Site icon HashtagU Telugu

Anjali ‘Bahishkarana’: వైవిధ్యమైన పాత్రలో అంజలి.. బహిష్కరణ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!

Anjali

Anjali

తెలుగు హీరోయిన్ అంజలి వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. వకీల్ సాబ్ మూవీతో ఆకట్టుకున్న అంజలి ప్రధాన పాత్రలో ‘బహిష్కరణ’ అని ఒక వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఆమెతో పాటు ‘వకీల్ సాబ్’లో నటించిన మరో తెలుగమ్మాయి, హీరోయిన్ అనన్యా నాగళ్ళ (Ananya Nagalla), నటులు రవీంద్ర విజయ్ (Ravindra Vijay), శ్రీతేజ, బాషా ఇతర ప్రధాన తారాగణం నటిస్తోంది. ఈ సిరీస్ నేరుగా జీ 5 ఓటీటీలో విడుదల కాబోతోంది. గ్రామీణ నేపథ్యంలో దీనిని తెరకెక్కించినట్టు తెలుస్తోంది.

శుక్రవారం తాజాగా ప్రధాన పాత్రలో  అంజలి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. చేతిలో ట్రంక్ పెట్టే పట్టుకొని, గ్రామీణ అమ్మాయిగా  రగ్గడ్ లుక్‌లో కనిపించింది. ఈ లుక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘ప్రేమతో సాగాల్సిన ప్రయాణం అవమాన భారంతో, బాధతో ముళ్ళ దారిలో సాగుతుంది. ఆ ప్రయాణం ఎలా మొదలైంది? ఏ తీరానికి చేరింది? అనేది సిరీస్ లో చూడాలి” అని ‘బహిష్కరణ’ బృందం పేర్కొంది. దీంతో పాటు మరికొన్ని కొత్త  వెబ్ సిరీస్‌ల‌ను ఈ ఏడాది వీక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు ‘జీ 5’ వెల్లడించింది.

Also Read: President Tour: రేపు హైదరాబాద్ కు రాష్ట్రపతి, సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు