Sandeep Vanga: ఒక పెద్ద సినిమాకు అంటే కనీసం పది కోట్లు వసూళ్లు వస్తాయా, లేదోనని ఈ రోజుల్లో టెన్షన్ పడుతున్నారు. కేవలం ఒక్క సినిమాతో 200 కోట్ల వసూళ్లు సాధించడం అంటే జాక్‌పాట్ కొట్టడం తక్కువేమీ కాదు. సందీప్ వంగా కుటుంబం “యానిమల్” సినిమాతో సరిగ్గా అదే చేసింది.
‘అర్జున్‌రెడ్డి’ తర్వాత సందీప్ వంగ ప్రొడక్షన్‌లో ఉన్నాడు. అతను బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పుడు తన సోదరుడు ప్రణయ్ రెడ్డిని అమెరికా నుండి తిరిగి తీసుకువచ్చాడు. అతనికి సినిమా నిర్మాణ బాధ్యతలను అప్పగించాడు. “యానిమల్” చిత్రానికి టి-సిరీస్ స్టూడియో నిధులను అందించినప్పటికీ, ప్రణయ్ రెడ్డి నిర్మాణంలోని అన్ని అంశాలను నిర్వహించి, ఫిఫ్టీ-ఫిఫ్టీ షేర్‌తో వెంచర్‌లో భాగస్వామి అయ్యాడు.
ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ యానిమల్ మూవీ భారీగా కలెక్షన్లను రాబడుతోంది. దీంతో వంగ కుటుంబానికి రెమ్యూనరేషన్, లాభాల వాటా 200 కోట్లకు చేరుకుంటుందని తెలుస్తోంది. ఇది రాజమౌళి లాంటి ప్రఖ్యాత దర్శకులకు కూడా సాధ్యం కాలేదు. పైగా, సినిమా ఇంకా నడుస్తోంది, ఫైనల్ ఫిగర్ ఎక్కడ ల్యాండ్ అవుతుందో ఎవరికీ తెలియదు.
Also Read: Nadendla Manohar: వైసీపీ ప్రభుత్వంలో ప్రతి శాఖలోనూ అవినీతి జరుగుతోంది