Nani : నానితో యానిమల్.. తలచుకుంటేనే అదోలా..?

సందీప్ వంగ (Sandeep Vanga) సినిమాలు కమర్షియల్ గా సూపర్ సక్సెస్ లు అందుకుంటున్నా.. యూత్ ఆడియన్స్ వారెవా అనేస్తున్నా కొంతమంది మాత్రం

Published By: HashtagU Telugu Desk
Animal Director For Nani What Will Happen

Animal Director For Nani What Will Happen

Nani అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ మూడు సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ తన నెక్స్ట్ సినిమా ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథతో స్పిరిట్ (Spirit) రాబోతుందని తెలుస్తుంది.ఐతే ఈమధ్య ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ రెడ్డి నాని కలిసి స్పెషల్ చిట్ చాట్ చేశారు. దానిలో సందీప్ వంగ నానితో కూడా సినిమా చేయాలనుకున్నారన్న విషయాన్ని వెల్లడించారు.

ఐతే నానితో సందీప్ వంగానా బాబోయ్ అనేస్తున్నారు. సందీప్ వంగ (Sandeep Vanga) సినిమాలు కమర్షియల్ గా సూపర్ సక్సెస్ లు అందుకుంటున్నా.. యూత్ ఆడియన్స్ వారెవా అనేస్తున్నా కొంతమంది మాత్రం అతని బోల్డ్ అటెంప్ట్ ని తప్పుపడుతున్నారు. దానికి కారణం కూడా ఇది అని చెప్పడం కష్టం. అయితే సినిమా అన్న తర్వాత ఎవరి ఒపీనియన్ వారికి ఉంటుంది.

ఐతే నానితో సందీప్ సినిమా చేస్తే ఎలాంటి సినిమా చేస్తాడన్న డౌట్లు మొదలయ్యాయి. నానినేమో క్లాస్ హీరో ఇప్పుడిప్పుడు మాస్ పంథాలో సినిమాలు చేస్తున్నాడు కానీ నాని కెరీర్ మొదటి నుంచి ఒక మంచి కుర్రాడిగానే కనిపిస్తూ అలాంటి పాత్రలున్న కథలనే ఎంచుకుంటున్నాడు. సందీప్ సినిమాలో హీరోలంతా చాలా వయిలెంట్ గా ఉంటారు.

నాని (Nani) నుంచి అలాంటి వైలెన్స్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చా అంటే ఏమో నటుడు అన్న తర్వాత ఏదైనా చేయాలి. సో కచ్చితంగా నాని కూడా సందీప్ డైరెక్షన్ లో సినిమా చేస్తే సందీప్ మార్క్ సినిమాల్లానే అదరగొట్టేస్తుందని అంటున్నారు. మరి ఈ కాంబో సినిమా ఎప్పుడు సెట్ అవుతుందో తెలియదు కానీ సినిమా చేస్తే మాత్రం అదిరిపోతుందని చెప్పొచ్చు.

Also Read : King Nagarjuna : నాగార్జున గారు ఏంటండీ ఇది..!

  Last Updated: 24 Jul 2024, 02:22 PM IST