Site icon HashtagU Telugu

Animal : ఏడాది పూర్తి చేసుకున్న ‘యానిమల్’

Animal 1yr

Animal 1yr

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి (Ranabir Kapoor – Sandeep Vangaa ) వంగా కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘యానిమల్’ (Animal ) విడుదలై నేటికీ (డిసెంబర్ 01) ఏడాది పూర్తయింది. గత ఏడాది ఇదే రోజున ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అలరించింది. అభిమానులు, సినీ ప్రేమికుల నుంచి అద్భుతమైన స్పందనతో యానిమల్ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించింది.

ఈ సందర్భంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రం రూ.900 కోట్లకు పైగా వసూలు చేయడం ద్వారా బాలీవుడ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా రికార్డులు సృష్టించింది. యానిమల్ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ అందించిన పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంలో యాక్షన్, ఎమోషన్, కుటుంబ సంబంధాల సన్నివేశాలు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసాయి. రష్మిక మందన్నా, అనిల్ కపూర్, పరేష్ రావల్ వంటి నటీనటుల పాత్రలు సైతం సినిమాకు మరింత బలం చేకూర్చింది. రణ్‌బీర్ కపూర్ కెరీర్‌లో ఇది మైలురాయి మూవీ గా నిలిచింది.

ఇక యానిమల్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ‘యానిమల్-2’ గురించి కూడా ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. ఈ సీక్వెల్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సీక్వెల్‌ను కూడా గ్రాండ్‌గా తెరకెక్కించనున్నారని సమాచారం. త్వరలో ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రావచ్చని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ‘యానిమల్’ చిత్ర విజయంతో రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పుడు ఈ మూవీ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు మరోసారి ఈ చిత్రాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Read Also : Sri Seeta Rama Jananam : ANR తొలి సినిమాకు 80 ఏళ్లు