Animal Beauty: రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ మూవీతో ఆకట్టుకున్నారు. ఈ మూవీ ద్వారా సందీప్ చాలా సర్ప్రైజ్‌లు ఇచ్చారు. ఈ మూవీలో రష్మితో పాటు మరో హీరోయిన్ కూడా ఆకట్టుకుంది. ఆ బ్యూటీ పేరే తృప్తి దిమ్రి. ఈ ప్రతిభావంతులైన నటి ఈ చిత్రంలో జోయా పాత్రను నటించి ప్రేక్షకుల మనసులను దోచుకుంది. రణబీర్ కపూర్ తో మంచి కెమిస్ట్రీ పండించి ఒక్కసారిగా స్టార్‌గా మారింది.
సినిమా విడుదలైన వారం రోజుల్లోనే హాట్ టాపిక్ గా మారింది. దీంతో యానిమల్ మూవీ అభిమానులు ఆమె గత సినిమాలు మరియు సిరీస్‌లను కూడా చూస్తున్నారు. తృప్తి దిమ్రి పాత్ర ‘యానిమల్’ మూవీలో కొద్దిసేపే కనిపించినా అందరినీ ఆకట్టుకుంది. ఆమెకు ఇప్పటికే తెలుగు ఫిల్మ్ మేకర్స్ నుండి చాలా ఆఫర్లు వస్తున్నాయని, హిందీ కూడా అవకాశాలు క్యూ కడుతున్నట్టు వార్తలు వచ్చాయి.
అయితే సందీప్ రెడ్డి వంగా తదుపరి ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా చేయబోతున్నాడు. ప్రభాస్ నటించే చిత్రంలో దర్శకుడు ఆమెకు ఒక మంచి పాత్రను ఆఫర్ చేయవచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ రూమర్ నిజమో కాదో వేచి చూడాల్సిందే.
Also Read: Tamil Nadu: మోడీజీ సాయం చేయండి ప్లీజ్, ప్రధానికి సీఎం స్టాలిన్ రిక్వెస్ట్