బాలీవుడ్ (Bollywood) లో అంతకుముందు సినిమాలు, మ్యూజిక్ వీడియోలు చేసినా కూడా కలిసి రాలేదు కానీ యానిమల్ ( Animal) సినిమాతో ఒక్కసారిగా లైం లైట్ లోకి వచ్చింది అందాల భామ త్రిప్తి డిమ్రి (Tripti Dimri,). అమ్మడు ఆ సినిమాలో ఉన్న కాసేపైనా అదరగొట్టేసింది. రణ్ బీర్ తో రొమాన్స్ లో రెచ్చిపోయిన త్రిప్తి బాలీవుడ్ ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. యానిమల్ హిట్ తో సూపర్ పాపులర్ అయిన త్రిప్తి వరుస ఛాన్సులు అందుకుంటుంది.
ఈ క్రమంలో అమ్మడు సినిమాలో ఉంటే గ్లామర్ షో పక్కా అని ఫిక్స్ అయ్యారు. ఐతే త్రిప్తి కూడా ప్రతిసారి అదే గ్లామర్ షో అయితే బోర్ కొట్టేస్తుంది అనుకున్న టైం లో బాలీవుడ్ క్లాసిక్ డైరెక్టర్ సూరజ్ భర్జత్యా నుంచి ఆఫర్ వచ్చింది. 30 ఏళ్ల కెరీర్ లో కేవల 7 సినిమాలే చేసిన డైరెక్టర్ సూరజ్ భర్జత్యా డైరెక్షన్ లో త్వరలో సినిమా రాబోతుంది.
ఆ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తుండగా త్రిప్తిని హీరోయిన్ గా ఎంపిక చేశారు. లవ్ స్టోరీలో త్రిప్తి డిమ్రి నటించడం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. ఇలాంటి లవ్ స్టోరీలో ఆమెను తీసుకోవడం ఛాలెంజింగ్ అయినా సూరజ్ భర్జత్యా త్రిప్తి క్రేజ్ ని వాడుకునేందుకు ఇలా చేస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా హమ్ ఆప్కె హై కౌన్, మైనే ప్యార్ కియా సినిమాలు తీసిన సూరజ్ భర్జత్యా డైరెక్షన్ లో త్రిప్తి ఛాన్స్ అంటే అది నిజంగా లక్కీ అని చెప్పొచ్చు.