Site icon HashtagU Telugu

Tirpti Dimri : పుష్ప 2 త్రిప్తి విషయంలో ఏం జరిగింది..?

Animal beauty Tirpti Dimri no chance for Pushpa 2 Item song

Animal beauty Tirpti Dimri no chance for Pushpa 2 Item song

అల్లు అర్జున్ (Allu Arjun) సుకుమార్ ఇద్దరు కలిసి చేసిన పుష్ప 1 బ్లాక్ బస్టర్ హిట్ కాగా ఆ సినిమా పార్ట్ 2 కోసం పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పుష్ప 2 అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ చేయగా పుష్ప 2 నెక్స్ట్ లెవెల్ లో ఉంచేలా సుక్కు పూర్తి ఫోకస్ తో ఉన్నాడు.

ఐతే పుష్ప 2 (Pushpa 2) సినిమా స్పెషల్ సాంగ్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. సినిమాను డిసెంబర్ 6న రిలీజ్ లాక్ చేయగా స్పెషల్ సాంగ్ చేసే లక్కీ ఛాన్స్ ఎవరికి ఇస్తారన్నది మాత్రం తేలలేదు. అసలైతే యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రికి ఆ ఛాన్స్ ఇస్తారన్న టాక్ వచ్చింది. కానీ సుకుమార్ ఎందుకో ఆమె విషయంలో ఆసక్తి చూపించలేదని టాక్.

ఉ అంటావా మావా సాంగ్ సెన్సేషనల్ హిట్ కాగా..

పుష్ప 1 లో సమంత (Samantha) చేసిన ఉ అంటావా మావా సాంగ్ సెన్సేషనల్ హిట్ కాగా దానికి ఏమాత్రం తగ్గకుండా పుష్ప 2 స్పెషల్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 త్రిప్తి డిమ్రి (Tirpti Dimri) అయితే బాగుండేది కానీ ఎందుకో మేకర్స్ మరో హీరోయిన్ ను తీసుకోవాలని చూస్తున్నారట. పుష్ప 2 స్పెషల్ సాంగ్ కి ఇప్పటికే దేవి ట్యూన్ ఓకే చేయగా త్వరలో సాంగ్ షూట్ జరగబోతుందని తెలుస్తుంది.

పుష్ప 2 విషయంలో మేకర్స్ ప్లానింగ్ అంతా కూడా భారీగా ఉంది. సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా ఫాహద్ ఫాజిల్ విలనిజం పీక్స్ లో ఉంటుందని తెలుస్తుంది. పుష్ప 2 తోనే కథ ఆగదని.. పుష్ప 3 కూడా ఉంటుందని ఈమధ్య హింట్స్ ఇచ్చిన విషయం తెలిసిందే.