Site icon HashtagU Telugu

Anil Sunkara : మొన్న ఏజెంట్.. ఇప్పుడు భోళా శంకర్.. పాపం నిర్మాత అనిల్ సుంకర..

Anil Sunkara gets huge loss with Agent and Bholaa Shankar Movies back to back

Anil Sunkara gets huge loss with Agent and Bholaa Shankar Movies back to back

దూకుడు, లెజెండ్, రాజు గారి గది, హైపర్, నమో వెంకటేశ.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాలని నిర్మించారు నిర్మాత అనిల్ సుంకర(Anil Sunkara). గతంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ తో పలు సినిమాలు నిర్మించాడు. ప్రస్తుతం అన్ని సినిమాలు AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైనే నిర్మిస్తున్నారు. కానీ ఇటీవల అనిల్ సుంకరకు అస్సలు కలిసి రావట్లేదు.

అనిల్ సుంకర నిర్మాణంలో 2021 లో వచ్చిన బంగారు బుల్లోడు, మహాసముద్రం రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇటీవల వచ్చిన అఖిల్ ఏజెంట్(Agent) సినిమా అయితే దారుణంగా ఫ్లాప్ అయి నిర్మాతకు భారీ నష్టం మిగిల్చింది. అసలు అఖిల్ కి 10 కోట్ల మార్కెట్ కూడా లేకపోయినా ఏకంగా 60 కోట్ల బడ్జెట్ పెట్టి ఏజెంట్ సినిమా తీసి దారుణంగా విఫలమయ్యారు అనిల్ సుంకర. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయిందని, అందులో తన తప్పు కూడా ఉందని అధికారికంగా ఒప్పుకున్నారు. ఈ సినిమా వల్ల అనిల్ సుంకరకు దాదాపు 40 కోట్ల నష్టం వచ్చిందని సమాచారం.

ఇక తాజాగా చిరంజీవి(Chiranjeevi) భోళా శంకర్(Bholaa Shankar) సినిమాతో వచ్చారు. ఈ సినిమా మొదటి రోజు నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. మూడో రోజుకే థియేటర్స్ ఖాళి అయ్యాయి. రెండు రోజుల్లో కేవలం 20 కోట్ల షేర్ కల్ట్ చేసింది భోళా శంకర్. ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ అవ్వాలంటే కనీసం 70 కోట్లు కలెక్ట్ చేయాలి. అసలు ఏ రకంగా చూసుకున్నా ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చేలా లేవు. పైగా ఈ సినిమాని చాలా చోట్ల అనిల్ సుంకర స్వయంగా రిలీజ్ చేశాడు. దీంతో నష్టం ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎలా లెక్కేసుకున్నా ఈ సినిమాకు కూడా కనీసం 40 కోట్లు నష్టం వస్తుందని టాక్.

దీంతో ఈ రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ దాదాపు 80 కోట్ల నష్టం రావడంతో అనిల్ సుంకరకు భారీ లాస్. దీంతో అంతా పాపం అంటున్నారు ఈ నిర్మాతను చూసి. అయితే ఈ గ్యాప్ లో ఒక రెండు చిన్న సినిమాలు మాత్రం అనిల్ సుంకరకు కాస్త ఉపశమనాన్ని ఇచ్చాయి. శ్రీవిష్ణు సామజవరగమన, అశ్విన్ హిడింబ సినిమాలు విజయం సాధించి డబ్బులు తెచ్చిపెట్టాయి. ఈ రెండు సినిమాలని కొనేసుకొని రిలీజ్ చేయడంతో ఈ రెండిటి మీద ఒక 20 కోట్ల వరకు లాభాలు వచ్చినట్టు సమాచారం.

ఇలా ఒకే సంవత్సరంలో రెండు పెద్ద సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో అనిల్ సుంకరకి భారీ నష్టం రావడంతో ఇండస్ట్రీ అంతా పాపం అంటున్నారు. మరి మళ్ళీ ఏ సినిమాతో వచ్చి ఈ డబ్బంతా రికవర్ చేసుకుంటారో చూడాలి.

 

Also Read : Sameera Reddy : సినిమా ఇండస్ట్రీలో స్నేహితులు ఎవ్వరూ నాకు హెల్ప్ చేయలేదు.. చాలా బాధ వేసింది..