Site icon HashtagU Telugu

Sudigadu 2 : సుడిగాడు 2 రాబోతోందా? అనిల్ రావిపూడి డైరెక్షన్ లో అల్లరి నరేష్..

Anil Ravipudi wants to plan Sudigadu 2 Movie with Allari Naresh

Anil Ravipudi wants to plan Sudigadu 2 Movie with Allari Naresh

హాస్య కథానాయకుడు అల్లరి నరేష్(Allari Naresh) దాదాపు 50కి పైగా కామెడీ సినిమాలు చేసి ప్రేక్షకులని నవ్వించి మెప్పించాడు. ఒకప్పుడు కామెడీ సినిమాలతో వరుస హిట్స్ కొట్టిన అల్లరి నరేష్ అనంతరం వరుస ఫ్లాప్స్ ని కూడా చూశాడు. దీంతో కొన్నాళ్ళు కామెడీ(Comedy) సినిమాలకు గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఎమోషనల్, సీరియస్ సినిమాలతో వస్తున్నాడు.

కామెడీకి గ్యాప్ ఇచ్చి నాంది సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. అనంతరం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో కూడా మెప్పించాడు. ఇప్పుడు ఉగ్రం సినిమాతో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా రాబోతున్నాడు. సీరియస్ కంటెంట్ తో పాటు యాక్షన్, ఎమోషన్స్ కంటెంట్ ని కూడా కలిపి నాంది దర్శకుడు విజయ్ తోనే మళ్ళీ రాబోతున్నాడు. ఉగ్రం సినిమా మే 5న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

అల్లరి నరేష్ కెరీర్ లోనే సుడిగాడు సినిమా పెద్ద హిట్ గా నిలిచింది. స్పూఫ్, కామెడీ సన్నివేశాలతో ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాగా భీమినేని శ్రీనివాసరావు ఈ సినిమాను తెరకెక్కించారు. 2012 లో ఈ సినిమా రిలీజయింది. అప్పట్లోనే ఈ సినిమా 7 కోట్లు పెట్టి తీస్తే 30 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.

ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. నేను చేసిన సినిమాల్లో సుడిగాడు సినిమా మంచి విజయం సాధించింది. నాకు ఆ సినిమాకు సీక్వెల్ తీయాలని ఉంది. దర్శకుడు అనిల్ రావిపూడి ఆ సినిమాకు రైటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు. ఇటీవల అనిల్ రావిపూడిని కలిసినప్పుడు సుడిగాడు 2 తీద్దామని ఆయనే అడిగాడు. నేను మళ్ళీ కామెడీ వైపు వస్తే నన్ను తీసుకెళ్తారా అని అడిగితే ఓకే అన్నాడు. దీంతో అల్లరి నరేష్ మళ్ళీ తన కామెడీని ఎప్పుడు చూపిస్తాడా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇక కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి, అల్లరి నరేష్ కలిస్తే ఆ సినిమా వేరే లెవల్ లో ఉంటుందని అంటున్నారు ప్రేక్షకులు.

 

Also Read :   Talasani Srinivas Yadav : ఎవరు పడితే వాళ్ళు అడిగితే నంది అవార్డులు ఇవ్వరు.. మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు..