సినిమా (Movie) ఎన్ని కోట్లతో తెరకెక్కించాం..? భారీ కాస్ట్ & క్రూ ఉందా..? వేలాది థియేటర్స్ లలో రిలీజ్ చేశామా..? అనేది కాదు ముఖ్యం. సినిమాను ప్రేక్షకుల్లోకి ఎంత వరకు తీసుకెళ్ళాం అనేది ముఖ్యం. ఈ మధ్య చాలామంది నిర్మాతలు (Producers) సినిమా నిర్మాణం పై ఫోకస్ చేసి , ప్రమోషన్ ను మరచిపోతున్నారు. దీంతో సినిమా టాక్ బాగున్నప్పటికీ సినిమాకు బజ్ రావడం లేదు. అంతెందుకు అసలు ఆ సినిమా రిలీజ్ అవుతుందని కానీ రిలీజ్ అయ్యిందని కానీ చాలామందికి తెలియడం లేదు. దీంతో సినిమా కలెక్షన్లు బాగా డ్రాప్ అవుతున్నాయి. అయితే సినిమా ప్రమోషన్ విషయంలో వర్మ స్టయిల్ వేరు. సినిమా ఎంత చెత్తగా ఉండని, సినిమా రిలీజ్ టైములో మాత్రం తనదైన శైలిలో ప్రమోషన్ (Promotion) చేసి సినిమాను వార్తల్లో నిలుపుతాడు. ప్రస్తుతం వర్మ సినిమాలు చేయడం కాదు ఆయనతో సినిమాలు చేసేందుకు కూడా ఎవరు ముందుకు రావడం లేదు.
Sam Konstas: విరాట్ కోహ్లీ నా ఆరాధ్య దైవం.. ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మెన్ సామ్ కాన్స్టాస్
ప్రస్తుతం మాత్రం ప్రమోషన్ విషయంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి (Director Anilravipudi) తనమార్క్ కనపరుస్తున్నాడు. వెంకటేష్ తో తాజాగా ఈయన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam) అనే మూవీ చేసాడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మూవీ తో పాటు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీస్ వస్తున్నప్పటికీ ప్రమోషన్ విషయంలో మాత్రం సంక్రాంతికి వస్తున్నాం దూకుడు కనపరుస్తుంది. ఏ ఫ్లాట్ ఫామ్ ను వదలకుండా నటి నటులతో ప్రమోషన్ చేయిస్తూ , ముఖ్యంగా సోషల్ మీడియా లో ఏ పేజీ ఓపెన్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం మూవీకి సంబదించిన వీడియోలే దర్శనం ఇస్తున్నాయి. యూత్ మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఈ సినిమాను మొదటి రోజే చేసెయ్యాలి అన్నట్లు ప్రమోషన్ తో ఆకట్టుకుంటున్నారు. వెంకీ సైతం గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఓవరాల్ గా మాత్రం అనిల్ రావిపూడి..ప్రమోషన్ విషయంలో తోపు అనిపించుకుంటున్నాడు.