Anil Ravipudi : ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి వెంకటేష్(Venkatesh) తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టాడు. ఫ్యామిలీస్ తో థియేటర్స్ నిండిపోతున్నాయి. ఈ సినిమా వెంకీమామకు మొదటి 100 కోట్ల సినిమా అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ రేంజ్ లో సినిమాకు క్రేజ్, బుకింగ్స్ ఉన్నాయి. ఈ సినిమా మాములు బడ్జెట్ లోనే తెరకెక్కింది.
మరో పక్క భారీ బడ్జెట్ తో, భారీ విజువల్స్ తో డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా కూడా ఈ సంక్రాంతికే రిలీజ్ అవ్వగా ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఇప్పటికే శంకర్ పై చాలా మంది అభిమానులు, నెటిజన్లు విమర్శలు చేశారు.
అయితే సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్స్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో సినిమా బడ్జెట్స్ గురించి మాట్లాడారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. నేను సినిమా చేసేటప్పుడు హీరోకి ఉన్న మార్కెట్ ఏంటి? ఎంత బడ్జెట్ లో సినిమా తీయాలి అని చూసుకుంటాను. సినిమా బిజినెస్ కాబట్టి రిలీజ్ చేసే టైం కి నిర్మాత సేఫ్ గా ఉండాలి అని చూసుకుంటాను. డబ్బులు అందరూ కష్టపడే సంపాదిస్తారు. వేరే వాళ్ళ డబ్బుతో నువ్వు గేమ్స్ ఆడొద్దు. నీ డబ్బుతో నువ్వు ఎన్ని ఆటలు ఆడుకున్నా అది నీ ఇష్టం. కానీ వేరే వాళ్ళు నీ మీద డబ్బులు పెడుతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నాకు కూడా ఎక్కువ ఖర్చుపెట్టి భారీ విజువల్స్, భారీ మేకింగ్ తో తీయాలని ఉంటుంది కానీ నేను నా ప్రాజెక్టు, బడ్జెట్ చూసుకొనే తీస్తాను అని అన్నారు.
దీంతో అనిల్ రావిపూడి కామెంట్స్ డైరెక్టర్ శంకర్ కేనా అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాలో అవసరం లేకపోయినా పాటలకు 75 కోట్లు ఖర్చుపెట్టారు. ముఖ్యంగా దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ శంకర్ కే అని అన్వయించుకుంటున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.
#AnilRavipudi SHOCKING Comment – he said Maintain the FILM BUDGET A/c to the HERO Market 😳😳😳😳😳#VenkyMama – #SankranthikiVasthunam – TRENDING BOOKINGS in all Areas ✅
— GetsCinema (@GetsCinema) January 14, 2025
Also Read : Jailer 2 : రజినీకాంత్ జైలర్ 2 అనౌన్స్మెంట్ టీజర్ అదిరిందిగా.. పార్ట్ 1 కి మించి ఎలివేషన్స్..