Anil Ravipudi : మొదటి సినిమా పటాస్ నుంచి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు దర్శకుడు అనిల్ రావిపూడి వరుసగా 8 హిట్స్ కొట్టాడు. ఒక చిన్న మెసేజ్ ని పెట్టి సినిమాని ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి సినిమాలను తీస్తాడు అనిల్. అయితే కొంతమంది సోషల్ మీడియా, యూట్యూబ్ రివ్యూల బ్యాచ్ మాత్రం అనిల్ రావిపూడిది క్రింజ్ కామెడీ అని ట్రోల్ చేస్తుంటారు.
అనిల్ రావిపూడి ఈ ట్రోల్స్ పెద్దగా పట్టించుకోను అని గతంలోనే చెప్పాడు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా పెద్ద హిట్ అయి ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చుకుంటున్నా కొంతమంది ఈ సినిమా గురించి కూడా అనిల్ పై విమర్శలు చేస్తున్నారు. దీంతో నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో అనిల్ రావిపూడి ఇండైరెక్ట్ తనపై వచ్చిన కౌంటర్లకి సమాధానం ఇచ్చాడు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. నేను రివ్యూలు, సినిమాల గురించి మాట్లాడే వాళ్ళ వీడియోలు చూస్తాను. వాళ్ళందరూ స్క్రీన్ ప్లే, క్యారెక్టర్ ఆర్క్, స్టోరీ టెల్లింగ్.. ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడతారు. అవేమి నాకు తెలీవు. నేను సినిమా గురించి పెద్దగా చదువుకోలేదు. నాకు తెలిసిన సినిమా ఒకటే స్క్రీన్ మీద సీన్ చూసి ప్రేక్షకులు విజిల్ వేయాలి, స్క్రీన్ మీద కామెడీ వస్తే ప్రేక్షకులు నవ్వాలి. స్క్రీన్ మీద ఎమోషన్ వస్తే ప్రేక్షకులు ఎమోషన్ అవ్వాలి. నేను చిన్నప్పట్నుంచి సినిమాలు ఇలా చూస్తూనే పెరిగాను. నాకు తెలిసిన సినిమా ఇదే. నేను ఇలాగే సినిమాలు తీస్తాను. ఇప్పటివరకు ఇలాగే సినిమాలు తీసాను. ఇకపై కూడా ఇలాగే సినిమాలు తీస్తాను అని అన్నారు. దీంతో అనిల్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత అనిల్ రావిపూడి చిరంజీవితో సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ కథ మీదే వర్క్ చేయబోతున్నాడు.
"నేను Cinema ని చదువుకోలేదు…. నాకు తెలిసిన సినిమా ఇదే….
ఇప్పటివరకు అదే తీసా…. ఇకముందు కూడా ఇలానే ఉంటది."
– #AnilRavipudi pic.twitter.com/OMuIiLOOj4
— Gulte (@GulteOfficial) January 17, 2025
Also Read : NTR 29th Annavery : నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్