Site icon HashtagU Telugu

Anil Ravipudi : IPL ని అంటే ఆడియన్స్ ఊరుకుంటారా..?

Anil Ravipudi

Anil Ravipudi

Anil Ravipudi టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనీల్ రావిపుడికి మంచి సక్సెస్ ట్రాక్ ఉంది. ఎంచక్కా ఏడాదికి ఒక సినిమా చేసుకుంటూ హిట్ ఫాం కొనసాగిస్తున్నాడు ఈ దర్శకుడు. రాజమౌళి తర్వాత చేసిన సినిమాలన్నీ సక్సెస్ అయిన డైరెక్టర్ ఇతనే. అయితే ఈమధ్య సత్యదేవ్ కృష్ణమ్మ ఈవెంట్ లో ఐపిఎల్ మీద అనీల్ రావిపుడి చేసిన కామెంట్స్ అతన్ని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసేలా చేసింది.

ఐపిఎల్ చూడకపోతే కొంపలేమి మునిగిపోవు అన్న కామెంట్ అనీల్ మీద ఐపిఎల్ లవర్స్ పగ పట్టేలా చేసింది. పనికట్టుకుని అతన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. విషయం గమనించిన అనీల్ రావిపుడి రీసెంట్ గా మరో ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చారు. ఒక డిస్ట్రిబ్యూటర్ తో మాట్లాడిన తర్వాత ఈవెంట్ లో అలా మాట్లాడాను తన మాటలు తప్పుగా అర్ధం చేసుకున్నారని అన్నారు అనీల్ రావిపుడి.

ఐపిఎల్ తాను చూస్తానని.. ఐపిఎల్ చూడండి సినిమాలు కూడా చూడండని అన్నారు అనీల్ రావిపుడి. ఐపిఎల్ ని ఎవరైనా కామెంట్ చేస్తే ఏ రేంజ్ లో ఇంపాక్ట్ ఉంటుందో అనీల్ ని సోషల్ మీడియాలో చేసిన ట్రోల్స్ చూస్తే అర్ధమవుతుంది. మొత్తానికి అనీల్ రావిపుడి కూడా జై ఐపిఎల్ అనేలా చేశారు.

Also Read : Dhanush : ధనుష్ తో దిల్ రాజు ప్రాజెక్ట్ ఫిక్స్..!