Anil Ambani and Abhishek Bachchan: శ్రీవారి సేవలో అనిల్ అంబానీ, అభిషేక్ బచ్చన్!

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్, పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, ఆయన సతీమణి టీనా అంబానీ, నీనా కొఠారీ

Published By: HashtagU Telugu Desk
Abhishek

Abhishek

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్, పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, ఆయన సతీమణి టీనా అంబానీ, నీనా కొఠారీ మంగళవారం తిరుమల ఆలయాన్ని సందర్శించి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అభిషేక్, అనిల్ అంబానీ, అతని కుటుంబం సుప్రభాత సేవ, అర్చన సేవ, తోమాల సేవలో పాల్గొన్నారు.

రంగనాయక మండపంలో ఆలయ అర్చకులు వారికి ఆశీస్సులు అందజేశారు. టీటీడీ అధికారులు అభిషేక్ బచ్చన్, అనిల్ అంబానీ, టీనా, నీనాలకు పట్టువస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. వీరికి శ్రీ పద్మావతి అతిథి గృహంలో బస ఏర్పాటు చేసినట్లు సమాచారం. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఈరోజు 80వ పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే అనిల్ అంబానీ, అభిషేక్ బచ్చన్ కలిసి రావడం ఆసక్తిని రేపింది.

  Last Updated: 11 Oct 2022, 02:48 PM IST