Site icon HashtagU Telugu

#RAP022 : ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అంటున్న రామ్

Andhrakingtaluka

Andhrakingtaluka

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే (Ram Pothineni ,Bhagyashri Borse) జంటగా నటిస్తోన్న #RAP022 చిత్రానికి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (Andhra King Taluka) టైటిల్ ఫిక్స్ చేశారు. అలాగే రామ్ పోతినేని బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ గ్లింప్స్ కూడా విడుదల చేసి ఆకట్టుకున్నారు.

చాలా కాలంగా మాస్ అండ్ యాక్షన్ పాత్రల్లో కనిపించిన రామ్ ఈసారి ఓ సరికొత్త ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ అనే టైటిల్ గ్లింప్స్ ద్వారా సినిమా పరిచయం చేస్తూ, స్లిమ్ అండ్ క్లీన్ లుక్‌లో రామ్ కనిపించి , మరోసారి తన రొమాంటిక్ సైడ్‌ను చూపించబోతున్నట్లు చెప్పకనే చెప్పాడు. ఈ చిత్రానికి మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నాడు.

Hair In Summer: వేసవిలో జుట్టు అందంగా ఉండాలి అంటే.. ఈ నేచురల్ ప్యాక్స్ ట్రై చేయాల్సిందే!

టీజర్ విషయానికి వస్తే..సినిమా థియేటర్.. టికెట్ల కోసం పలుకు బడిని వాడటం.. ఎమ్మెల్యే, పోలీస్ తాలుకా అంటూ ఇలా టికెట్లు తీసుకుంటూ ఉండటం.. ఆంధ్రా కింగ్ సూర్య సినిమా అంటే మామూలు విషయమా? అని చెప్పడం.. మన హీరో ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్ అని చెప్పి.. ఆంధ్ర కింగ్ తాలుకా అని యాభై టికెట్లు తీసుకోవడవం వంటివి చూస్తుంటే నిజంగానే ఇదొక ఫ్యాన్ బయోపిక్‌లానే అనిపిస్తోంది. ఆంధ్రా కింగ్ అని పవన్ కళ్యాణ్‌ అంటే మహేష్ బాబు ఫ్యాన్స్.. మహేష్ బాబుని ఆంధ్ర కింగ్ అని అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ వార్‌కి దిగేవారు. ఇక ఇలా తెలుగులో ఏ హీరోని రిఫరెన్సుగా తీసుకున్నా దెబ్బ పడేది. అందుకే మేకర్లను ఉపేంద్రను తీసుకొచ్చి వార్ లేకుండా చూసుకున్నారు. ఓవరాల్ గా టీజర్ అదిరిపోవడం తో సినిమా కూడా అదిరిపోతుందని భావిస్తున్నారు.