Site icon HashtagU Telugu

Andela Ravamidhi : అందెల రవమిది మూవీ ఎలా ఉందంటే !!

Andela Ravamidhi

Andela Ravamidhi

భారతీయ నృత్య కళల పట్ల మక్కువతో ఓ వైపు శిక్షణ ఇస్తూనే దర్శకురాలిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు ఇంద్రాణి దావులూరి. ఆమె నటించి దర్శకత్వం వహించిన ‘అందెల రవమిది’ (Andela Ravamidhi ) అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారతీయ నృత్య కళలను తెలిజేయజేసే ఈ సినిమాకు ఇంద్రాణి దావులూరి నిర్మాతగా వ్యవహరించడం విశేషం.

‘అందెల రవమిది’ కథ విషయానికి వస్తే.. భారతీయ నృత్యరీతుల్లో తన ప్రతిభను ప్రపంచ స్థాయిలో నిరూపించుకోవాలని తపన పడే పావని (ఇంద్రాణి దావులూరి). కానీ అనుకోని పరిస్థితుల్లో పావనికి రమేశ్‌ (విక్రమ్ కొల్లూరు)తో వివాహం జరిగుతుంది. అనంతరం వారి ఫ్యామిలీ అమెరికాలో స్థిరపడుతుంది. అయితే నృత్య కళలు పట్ల పావనికి ఉన్న మక్కువ చూసి అక్కడే డాన్స్ స్కూల్ ప్రారంబించుకునేందుకు సహకరిస్తాడు రమేష్. ఈ నేపథ్యంలో కొంత కాలం పిల్లలు వద్దనుకుంటారు. అయితే పలు కారణాల రీత్యా పావనికి ఆపరేషన్ జరిగి పిల్లలు పుట్టరని తెలుస్తుంది. వంశ గౌరవం కోసం రమేష్ రెండో పెళ్లి చేసుకున్నాడా? పావని తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుందా? అసలు భరద్వాజ్ ఎవరు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

EPFO Alert : EPFO ఖాతాదారులకు అలర్ట్

విశ్లేషణ : కె విశ్వనాధ్ లాంటి మహానుభావులు నృత్య కళలు వర్థిల్లాలని స్వాతి కిరణం, శంకరాభరణం, సాగరసంగమం వంటి గొప్ప సినిమాలు చేసారు. అప్పట్లో ప్రేక్షకులు వాటిని ఆరాదించారు కూడా. కానీ ఇప్పటి AI జనరేషన్ యుగంలో ఇలాంటి సినిమాలకు ఆదరణ తక్కువనే చెప్పాలి. కానీ ఇంద్రాణి రిస్క్ అని తెలిసి కూడా ఈ సినిమాను నిర్మించారు. సినిమా ఎక్కువ భాగం అమెరికాలోనే సాగుతుంది. ఓ యాక్సిడెంట్.. దానికి కొంత బ్యాక్ లోకి అక్కడ స్లో గా సాగె కథ. స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా ఉంది. అనుకున్న లక్ష్యాన్ని సాదించేందుకు ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవాలనే థాట్ బాగుంది.

నటీనటుల విషయానికి వస్తే.. లీడ్ రోల్ చేసిన ఇంద్రాణి దావులూరి చక్కటి అభినయం కనబరిచింది.ఎమోషనల్ సీన్స్ లోను ఆమె హావభావాలు బాగున్నాయినటిగా, దర్శకురాలిగా ఆమె ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. నిర్మల, తనికెళ్ళ భరణి, విక్రమ్ కొల్లూరు, జయలలిత , ఆదిత్య మీనన్ తమ పాత్రల పరిధిమేర నటించారు.

టెక్నికల్ టీమ్ : వేణు నక్షత్రం రాసిన కథ బాగుంది. కార్తీక్ కొడకండ్ల మ్యూజిక్, నేపథ్య సంగీతం బాగుంది. రఘు కుల్ మోకిరాల అందించిన డైలాగ్స్ &సాంగ్స్ కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ అమెరికా లొకేషన్స్ ను బాగానే చూపించారు. నిర్మాణవిలువలు బాగానే ఉన్నాయి.

ఓవరాల్ : అందెల రవమిది.. మెచ్చుకోదగ్గ ప్రయత్నం

Exit mobile version