Site icon HashtagU Telugu

Vishnupriya : ముద్దు పెట్టుకునే ఛాన్స్ నాకెప్పుడూ వస్తుందో.. యాంకర్ హాట్ కామెంట్స్..

Anchor Vishnupriya naughty comments on Ranbir Kapoor

Anchor Vishnupriya naughty comments on Ranbir Kapoor

షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ పరిశ్రమలోకి వచ్చిన విష్ణుప్రియ ఆ తర్వాత యాంకర్ గా మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం పలు టీవీ షోలలో అప్పుడప్పుడు కనిపిస్తూ అడపాదడపా సినిమాలు చేస్తూ, ప్రైవేట్ సాంగ్స్ తో అదరగొడుతుంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా బోల్డ్ ఫోటోలు పెట్టి హడావిడి చేస్తుంది విష్ణుప్రియ.

తాజాగా విష్ణుప్రియ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ – అలియా తాజాగా తమ వివాహ మొదటి వార్షికోత్సవం రోజు బయటకి వచ్చారు. కారులో వెళ్లిపోతుండగా వీరికి శుభాకాంక్షలు తెలపడానికి అభిమానులు వారిని చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో కారులో కూర్చున్న అలియా తన భర్త రణబీర్ కపూర్ ని దగ్గరికి తీసుకొని బుగ్గపై ముద్దు పెట్టింది. దీంతో పబ్లిక్ లో అలియా అలా సడెన్ గా భర్తకి ముద్దు ఇవ్వడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

తాజాగా యాంకర్ విష్ణుప్రియ ఈ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. ఓ దేవుడా.. నాకెప్పుడూ అలా ముద్దుపెట్టుకుని ఛాన్స్ వస్తుంది అని కామెంట్ చేస్తుంది. దీంతో ఈ పోస్ట్ వైరల్ కాగా వేరే వాళ్ళ భర్తకు నువ్వు ఎందుకు ముద్దు పెట్టడం అని, నీ భర్తకి పెట్టాలంటే పెళ్లి చేసుకో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక విష్ణుప్రియ ఇటీవలే మానస్ తో కలిసి గంగులు అనే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ తో అలరించింది.