Site icon HashtagU Telugu

Vishnu Priya: నా ఫస్ట్ క్రష్ అతనే.. యాంకర్ విష్ణుప్రియ కామెంట్స్ వైరల్?

Vishnu Priya

Vishnu Priya

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ విష్ణు ప్రియ భీమనేని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై సందడి చేసే ఫిమేల్ యాంకర్స్ లో యాంకర్ విష్ణు ప్రియ కూడా ఒకరు. యాంకర్ విష్ణుప్రియకి సోషల్ మీడియాలో హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూనే, పండుగ సమయాలలో నిర్వహించే ఈవెంట్ లలో కూడా సందడి సందడి చేస్తూ ఉంటుంది. యాంకర్ గా బుల్లి తెరపై అడుగుపెట్టి ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. పోవే పోరా అనే కార్యక్రమం ద్వారా యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

షోలో తోటి యాంకర్ గా వ్యవహరిస్తున్న సుధీర్ తో కలిసి అల్లరి అల్లరి చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఇటీవల గంగులు అనే ఒక వీడియో సాంగ్ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ మానస్ తో కలిసి స్టెప్పులు ఇరగదీసింది. తాజాగా ఒక టీవీ షోలో పాల్గొన్న విష్ణు ప్రియ యాంకర్ అడిగిన ప్రశ్నకు షాకింగ్ సమాధానం ఇచ్చింది. మీరు ఎవరైనా సెలబ్రిటీతో క్రష్‌లో ఉన్నారా? అని యాంకర్ ప్రశ్నించగా? ఆ విషయం పై స్పందించిన విష్ణు ప్రియ..ఇటీవలే జేడీ చక్రవర్తితో ప్రేమలో పడ్డాను. ఒక వెబ్ సిరీస్ కోసం మంగళూరులో ఆయనతో జర్నీ చేశాను.

పది రోజులకే ఆయనపై మనసు పారేసుకున్నాను. అయితే ఆయన వయసులో నాకంటే పెద్దవారు. ఆంటీ ఓకే చెబితే వాళ్లింటికి కోడలిగా వెళ్తాను. జేడీ చక్రవర్తిని పిచ్చిగా ప్రేమిస్తున్నాను అని చెప్పుకొచ్చింది విష్ణు ప్రియ. ఇంతలోనే యాంకర్ మీ ప్రేమ పెళ్లిగా మారే ఛాన్స్ ఉందా? అని ప్రశ్నించగా.. నేను నా మనసులో మాట చెప్పాను. ఆయన రెస్పాండ్ అవ్వలేదు అని తెలిపింది విష్ణుప్రియ.

Exit mobile version