Roshan Kanakala స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల అప్పుడెప్పుడో నిర్మలా కాన్వెంట్ సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఆ సినిమాను కింగ్ నాగార్జున నిర్మించారు. అయితే మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చిన రోషన్ మళ్లీ ఇన్నాళ్లకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రవికాంత్ పేరేపు డైరెక్షన్ లో బబుల్ గం సినిమాతో రోషన్ హీరోగా తొలి ప్రయత్నం చేశాడు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మానస చౌదర్య్ నటించింది.
టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా నిర్మించింది. డిసెంబర్ 29న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అయితే ముందు సలార్ ఉందన్న భయం కూడా లేకుండా రోషన్ తన సినిమా వదులుతున్నాడు. మరి సుమ తనయుడు ఈ టైం లో ఈ రిస్క్ అవసరమా అని ఆడియన్స్ అంటున్నారు.
Also Read : Vikram Tangalaan : విక్రమ్ సినిమాలకే ఎందుకిలా జరుగుతుంది.. వాటి బాటలోనే తంగళాన్..!
మనం ఎంత మంచి సినిమా చేసినా రిలీజ్ టైం బాగాలేకపోతే రిజల్ట్ తేడా కొట్టేస్తుంది. సలార్ మేనియాలో ఉన్న ఆడియన్స్ ని బబుల్ గం తినిపించడంలో రోషన్ ఏమేరకు సక్సెస్ అవుతుండానన్నది చూడాలి. ఈ సినిమాలో యూత్ ఆడియన్స్ మెచ్చే అంశాలు పుష్కలంగా ఉండటంతో సినిమా వారికి చేరువయ్యేలా ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. తనయుడి మొదటి సినిమా కాబట్టి సినిమా ప్రమోషనల్ బాధ్యతని అంతా కూడా సుమ తన భుజాన వేసుకుంది.
అందుకే సినిమా రిలీజ్ కాస్త లేట్ అయినా పర్వాలేదని అనుకుంటున్నారు. ఏది ఏమైనా విక్రం కి మాత్రం ఈమధ్య బ్యాడ్ లక్ నడుస్తుందని చెప్పొచ్చు. తంగళాన్ తో తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్న విక్రం కి కాలం కలిసి రావట్లేదు.
We’re now on WhatsApp : Click to Join