Site icon HashtagU Telugu

Anchor Suma : మీడియాపై సుమ సెటైర్లు.. అనంతరం సారి చెప్పిన సుమ..

Anchor Suma satire on Media and says Sorry

Anchor Suma satire on Media and says Sorry

యాంకర్ సుమ(Anchor Suma) రెండు దశాబ్దాలుగా టీవీతో షోలతో తెలుగు వారింట్లో ఆడపడుచులా మారిపోయింది. ఇక సినిమా ఈవెంట్స్, సినిమాలు, యూట్యూబ్ తో కూడా బిజీగా ఉంటుంది సుమ. స్టేజిపై చలాకీగా, తడబడకుండా మాట్లాడుతూ సినిమా ఈవెంట్స్ లో అందర్నీ అలరిస్తుంది. తాజాగా సుమ మీడియా వాళ్ళని ఒక మాట అనడం, మీడియా వాళ్ళు దానిపై స్పందించడం, అనంతరం సుమ సారీ చెప్పడం కూడా జరిగింది.

తాజాగా వైష్ణవ తేజ్, శ్రీలీల జంటగా నటించిన ఆదికేశవ(Adikeshava) సినిమాలోని ఓ సాంగ్ లాంచ్ ఈవెంట్ జరగగా సుమ హోస్ట్ చేసింది. ఈ కార్యక్రమం ప్రారంభంలో సుమ మాట్లాడుతూ.. స్నాక్స్ ని భోజనాల్లా తినకుండా మీడియా(Media) వాళ్ళు వస్తే ప్రోగ్రాం మొదలుపెట్టొచ్చు అంది. దీంతో పలువురు మీడియా మెంబర్స్ సుమ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. ఆ మాట అనకుండా ఉండాల్సిందని అక్కడే సుమతో చెప్పడంతో సుమ కూడా జోక్ చేశాను, ఎవరైనా ఫీల్ అయితే సారీ అని కూడా చెప్పింది.

అయితే సుమ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు మీడియా వాళ్ళు సుమపై ఈ విషయంలో విమర్శించారు. దీంతో యాంకర్.. సుమ మీడియాకు తాను మాట్లాడిన మాటలతో ఇబ్బంది పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను అని ఓ వీడియో రిలీజ్ చేసింది. దీంతో సుమ – మీడియా వ్యవహారం ఇప్పుడు వైరల్ గా మారింది.

 

Also Read : Amala Paul : రెండో పెళ్లి చేసుకోబోతున్న అమలాపాల్.. బర్త్‌డే రోజు రొమాంటిక్ ఫోటోలు షేర్ చేసిన కాబోయే వరుడు..