Sreemukhi: ‘కేరింత’ నటుడి చెంప చెల్లుమనిపించిన శ్రీముఖి…

కేరింత (Kerintha Movie) నటుడి చెంప చెల్లుమనిపించి వార్తల్లో నిలిచింది యాంకర్ శ్రీముఖి (Anchor Srimukhi)

Published By: HashtagU Telugu Desk
Srimukhi

Srimukhi

కేరింత (Kerintha Movie) నటుడి చెంప చెల్లుమనిపించి వార్తల్లో నిలిచింది యాంకర్ శ్రీముఖి (Anchor Srimukhi). నటిగా జులాయి మూవీ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. పవన్ సాదినేని దర్శకత్వం వహించిన ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాతో హీరోయిన్ అవతారం ఎత్తింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవడంతో శ్రీముఖి హీరోయిన్‌గా నిలబడలేకపోయింది. అయితే ఆ తర్వాత తమిళం, కన్నడలోనూ సినిమాలు చేసింది. ఇక నేను శైలజా, జెంటిల్ మెన్, భోళా శంకర్ ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెగ బిజీగా మారిపోయింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు యాంకర్‌గానూ చెలరేగిపోతుంది. మరీ ముఖ్యంగా పటాస్ షో ఈ బ్యూటీకి మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ మూడో సీజన్‌లోను కంటెస్టెంట్‌గా వెళ్లి తన ఆటతీరు, మాట తీరుతో బిగ్ బాస్ ప్రియులను తెగ ఆకట్టుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం శ్రీముఖి స్టార్ మాలో ప్రసారమవుతన్న సూపర్ సింగర్3 కి హోస్ట్‌గా చేస్తుంది. అలాగే సినిమాల ప్రమోషన్ లలో కూడా మెరుస్తూ అలరిస్తుంది. ఇక ఇప్పుడు ‘కేరింత’ ఫేమ్ పార్వతీశం (Parvateesam ) చెంపచెళ్లుమనిపించి వార్తల్లో నిలిచింది. కేరింత మూవీ లో నూకరాజు గా అందర్నీ ఆకట్టుకున్న పార్వతీశం ..ఆ తర్వాత ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’ తో పాటు మరికొన్ని సినిమాల్లో మెరిసాడు. అయితే హీరోగా మాత్రం పార్వతీయంకు మంచి బ్రేక్ దొరకడం లేదు. ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత ‘మార్కెట్ మహాలక్ష్మీ’ అనే సినిమాతో ఆడియెన్స్ ను పలకరించడానికి సిద్దమయ్యాడు. మార్చి 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో మేకర్స్ చాల కొత్తగా ప్రమోషన్ చేస్తూ సినిమాకు బజ్ తీసుకొస్తున్నారు.

రీసెంట్ గా మహాలక్ష్మీ అనే పేరున్న మహిళలందరికీ 200 టిక్కెట్లు ఫ్రీగా ఇస్తానని చెప్పడం ఓ రేంజ్ లో వైరల్ అయిపోయింది. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమా యూనిట్ యాంకర్ శ్రీముఖితో ప్రమోషన్ చేయించుకుంది. ఇందులో భాగంగా పార్వతీశం.. శ్రీముఖీకి ప్రపోజ్ చేయడం.. తను లాగి చెంపమీద కొట్టడం, మార్కెట్ మహాలక్ష్మీ.. మజాక్ లాడితే మంచిగుండది అని చెప్పినట్లు ప్రోమోను కట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తుంది.

Read Also :  Water Crisis in Hyderabad : హైదరాబాద్ కు పెను ప్రమాదం పొంచి ఉందా..?

  Last Updated: 22 Mar 2024, 03:32 PM IST