Site icon HashtagU Telugu

Sreemukhi: బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీముఖి.. ఆ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్?

Sreemukhi

Sreemukhi

తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం శ్రీముఖి ఒకవైపు టీవీల్లో వరుసగా రియాల్టీ షోస్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది. యాంకర్‏గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా తన మాటలతో తన ఎనర్జీతో అలరిస్తూ ఉంటుంది శ్రీముఖి. ఇక ఈ మధ్యకాలంలో చాలావరకు షోలకు యాంకరింగ్ చేస్తూ డబ్బులు కూడా భారీగానే సంపాదిస్తోంది. ఇక కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ హీరోయిన్ల కంటే అందంగా రెడీ అవ్వడంతో పాటు హీరోయిన్ రేంజ్ లో అందాలను ఆరబోస్తూ ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join
రీల్స్ ఫన్నీ వీడియోస్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోషూట్స్ చేస్తూ హీరోయిన్స్ సైతం తన ముందు దిగదుడుపే అనేలా చేస్తుంటుంది. ఒకసారి పద్ధతిగా కనిపిస్తూనే మరొకసారి గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ పిచ్చెక్కిస్తూ ఉంటుంది శ్రీముఖి. ఇలా అవుట్ ఫిట్ లో కనిపించిన కూడా అందాల ఆరబోత మాత్రం మామూలుగా ఉండదు అని చెప్పవచ్చు. మోడ్రన్ డెస్సుల్లో కాకుండా ట్రెడిషనల్ లుక్ లో ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నెట్టింట స్పెషల్ అట్రాక్షన్ అవుతూ ఉంటుంది. మూడు పదుల వయసులోకి అడుగుపెట్టిన శ్రీముఖి ఇప్పటివరకు పెళ్లి గురించి మాట్లాడటం లేదు. అలాగే ప్రేమ, రిలేషన్ షిప్ కు దూరంగా ఉంటుంది.

Also Read: Meera Jasmine: మొదటిసారి ఫ్యామిలీ ఫోటో ని షేర్ చేసిన మీరా జాస్మిన్.. పోస్ట్ వైరల్!

ఆ సంగతి పక్కన పెడితే తాజాగా శ్రీముఖికి సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతోంది. అదేమిటంటే.. ఈ స్టార్ యాంకర్ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమాలో ఆఫర్ కొట్టేసినట్లు టాక్ నడుస్తోంది. అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా చిత్రంలో శ్రీముఖి మంచి పాత్రలో కనిపించనుందట. ఈ మూవీలో కూడా బన్నీకి సిస్టర్​ రోల్​లో రాములమ్మ కనిపించనుందట. గతంలో వీరిద్దరూ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జులాయిలో అన్నా చెల్లెళ్లుగా నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీకి మ్యూజిక్ అనిరుధ్ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా అఫీషియల్​గా షురూ అవ్వనుంది.

Also Read: Priyamani: ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ప్రియమణి.. అందాల ఆరబోత మామూలుగా లేదుగా?

Exit mobile version