Anchor Shyamala : యాంకర్ శ్యామల సినీ కెరియర్ అంతే సంగతా..?

యాంకర్ శ్యామల మాత్రం వైసీపీ తరుపున ప్రచారం చేస్తూ వస్తుంది. ఇదే క్రమంలో చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లపై పరోక్షంగా ఈమె చేసిన పలు కామెంట్స్ పట్ల నెటిజన్లు , అభిమానులు , పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

  • Written By:
  • Publish Date - May 4, 2024 / 11:19 AM IST

రాజకీయాల (Politics) జోలికి వెళ్లకూడదని..రాజకీయాలు అనేది పెద్ద రొచ్చు అని చాలామంది అభిప్రాయపడుంటారు. ఎన్నికల సమయంలో తమకు నచ్చిన లీడర్ కు ఓటు వేశామా..తిరిగి మన పని మనం చేసుకున్నామా..అని అంత మాట్లాడుకుంటారు. కానీ కొంతమంది కావాలని రాజకీయాల జోలికి వెళ్లి అందరి చేత చివాట్లు తింటూ..కెరియర్ నాశనం చేసుకుంటారు. ముఖ్యంగా చిత్రసీమ(Film Industry)లో చాలామంది అందుకే రాజకీయాల జోలికి వెళ్లేందుకు కాస్త వెనకడుగు వేస్తారు. ఎవరికీ మద్దతు తెలిపితే..ఎవరు ఎలా స్పందిస్తారో..తర్వాత ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని చాలామంది భయపడుతుంటారు. తమకు లోలోపల పాలనా అభ్యర్ధికి మద్దతు తెలుపాలని , ప్రచారం చేయాలనీ ఉన్నప్పటికీ..అవతల పార్టీల వ్యక్తులను చూసి కాస్త వెనుకడుగు వేస్తారు. ప్రస్తుతం ఏపీ ఎన్నికల హోరు నడుస్తుంది..ఈసారి నువ్వా..నేనా అనే రేంజ్ లో కూటమి vs వైసీపీ (YCP) గా మారింది. ఇలాంటి ఈ సమయంలో కొంతమంది సినీ ప్రముఖులు ధైర్యం చేసి ప్రచారం చేస్తున్నప్పటికీ , చాలామంది మాత్రం నేరుగా బయటకు రాకున్నా లోలోపల మాత్రం సపోర్ట్ ఇస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈసారి ఎక్కువగా కూటమి పార్టీ విజయం సాదించబోతుందని పలు సర్వేలు , ప్రజలు చెపుతుండడంతో సినీ ప్రముఖులు సైతం కూటమికి మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈసారి పవన్ కళ్యాణ్ కోసం చాలామంది సినీ ప్రముఖులు రంగంలోకిదిగారు. బుల్లితెర , వెండితెర నటి నటులు గత 15 రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తూ పవన్ కళ్యాణ్, కూటమి అభ్యర్థులకు ప్రచారం చేస్తూ వస్తున్నారు. అయితే ఈసారి వైసీపీ తరుపున ప్రచారం చేసేందుకు సినీ ప్రముఖులు కరవయ్యారు. కానీ యాంకర్ శ్యామల (Anchor Shyamala) మాత్రం వైసీపీ తరుపున ప్రచారం చేస్తూ వస్తుంది. ఇదే క్రమంలో చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లపై పరోక్షంగా ఈమె చేసిన పలు కామెంట్స్ పట్ల నెటిజన్లు , అభిమానులు , పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్రసీమకు ఏ మంచి చేసాడని జగన్ కు సపోర్ట్ ఇస్తున్నారని శ్యామల ను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా టికెట్స్ రేటు తగ్గించినందుకా..? రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినందుకా..? ఉద్యోగులు లేక నిరుద్యోగులను గంజాయి కి అలవాటు పడేలా చేసినందుకా..? ఇసుక మాఫియా చేసినందుకా..? జగన్ ఏంచేసాడని మద్దతు ఇస్తున్నారని శ్యామలను ప్రశ్నిస్తున్నారు. ఇదే సందర్బంగా పలు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా అలీ ఇలాగే పవన్ కళ్యాణ్ ను మోసం చేసాడని..పవన్ కళ్యాణ్ ను కాదని జగన్ కు మద్దతు ఇచ్చి..ఈరోజు ఛాన్సులు లేకుండా అయిపోయాడని..ఆయన ఎంత పెద్ద తప్పు చేసాడో తెలుసుకొని ఈరోజు వైసీపీ కి దూరంగా ఉన్నాడని..అలీ లాంటి వ్యక్తులకే ఈరోజు ఛాన్స్లు లేకుండా అయిపోయాయంటే ..మీ పరిస్థితి ఎలా ఉంటుందో కాస్త ఆలోచించుకొని అంటూ సలహా ఇస్తున్నారు.

Read Also : Shock To YCP: వైసీపీకి షాక్ ఇస్తున్న మ‌రో స‌ర్వే సంస్థ‌..?