యాంకర్ శ్యామల అందరికీ సుపరిచితమే. కెరీర్ ప్రారంభంలో పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన శ్యామల అటు తర్వాత సినిమాల్లో అవకాశాలు పొందింది. స్పీడున్నోడు, బెంగాల్ టైగర్’ లౌక్యం, మిస్టర్ లాంటి సినిమాల్లో నటించింది కానీ అవేవి ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. దాంతో అక్కడ పెద్దగా రాణించింది ఏమీ లేకపోవడంతో బుల్లితెర పైనే బిందాస్ గా సెటిల్ అయ్యింది. పలు సినిమా ఫంక్షన్స్ ను హోస్ట్ చేస్తూనే, సినీ నటీనటులను ఇంటర్వ్యూలు చేయడం వంటివి చేస్తుంది.
అలాగే బుల్లితెరపై పలు షోలకు యాంకర్ గా కూడా వ్యవహరించింది. కాగా గత ఏడాది విడుదలైన విరూపాక్ష చిత్రంతో శ్యామల కీలక రోల్ చేసింది. విరూపాక్ష సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈమె చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్యామల తన కెరియర్ బిగినింగ్ లో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఆమె చెప్పుకొచ్చింది. ఈ సందర్బంగా శ్యామల మాట్లాడుతూ.. సినిమాల్లో రాణించాలని నేను అమ్మతో పాటు హైదరాబాద్ కి వచ్చాను. సీరియల్స్ లో అవకాశాలు రావడంతో నటించాను. ఆ సమయంలో కొన్ని ఇబ్బందులు కలిగాయి.
కొందరు నన్ను విసిగించేవారు. లవ్ ప్రపోజల్స్ పెట్టేవారు. దాంతో విసిగిపోయిన నేను ఒప్పుకున్న మూడు సీరియల్స్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. సీరియల్స్ కి పని చేసే ఒక కెమెరామెన్ బాగా వేధించాడు. అర్ధరాత్రి ఫోన్ చేసేవాడు. ఒకరోజు అమ్మ కాల్ లిఫ్ట్ చేసింది. మీకు మగదిక్కు లేదు. నేను ఏదైనా చేయగలను అంటూ బెదిరించాడు. దాంతో అమ్మ భయపడింది. నేను మాట్లాడుతుంటే మీ అమ్మాయి పట్టించుకోవడం లేదు. మీరైనా చెప్పండి అని భయపెట్టాడని శ్యామల అన్నారు. కాగా ఈ సందర్బంగా శ్యామల చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. .