Site icon HashtagU Telugu

Controversy : హిందువులకు క్షేమపణలు చెప్పిన యాంకర్ రవి

Ravisorry

Ravisorry

బుల్లితెర యాంకర్ రవి (Anchor Ravi) ఇటీవల ఓ వివాదం(Controversy)లో చిక్కుకున్న విషయం తెలిసిందే. జీ తెలుగులో ప్రసారమయ్యే ‘సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్’ అనే కార్యక్రమంలో నటుడు సుడిగాలి సుధీర్‌(Sudigali Sudheer)తో కలిసి చేసిన ఓ స్కిట్‌కి సంబంధించి హిందూ సమాజం (Hindu Society) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 1998లో వచ్చిన ‘బావగారు బాగున్నారా’ సినిమాలోని ప్రసిద్ధమైన శివాలయ సన్నివేశాన్ని స్పూఫ్ చేస్తూ, దాన్ని హాస్యంగా మార్చడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని పలువురు తెలిపారు.

New CM : అతి త్వరలో తెలంగాణ కు కొత్త సీఎం – బిజెపి ఎంపీ సంచలన వ్యాఖ్యలు

ఈ నేపథ్యంలో యాంకర్ రవి మొదట్లో హిందూ సంఘానికి చెందిన ఓ నేతతో ఫోన్‌లో మాట్లాడిన రికార్డింగ్‌ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో తనకు తప్పేంమీదే తెలియదని, క్షమాపణలు చెప్పనని స్పష్టం చేశారు. కానీ ఈ ఫోన్ సంభాషణపై విమర్శలు ఊపందుకున్న వెంటనే, రవి తానే స్వయంగా ఓ వీడియో విడుదల చేసి వివరణ ఇచ్చారు. అందులో “ఇది ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు చేసిన స్కిట్ కాదు, ఒక సినిమా సీన్‌ స్పూఫ్ మాత్రమే. చాలా మంది హర్ట్ అయ్యారని తెలిసింది. ఇకపై ఇలాంటి దానికి దూరంగా ఉంటాం” అని రవి అన్నారు.

Praja Vedika In Vadlamanu : హామీలు నెరవేర్చాకే ఓట్లు అడుగుతాం – సీఎం చంద్రబాబు

ఈ వివాదం రంభ గెస్ట్‌గా పాల్గొన్న ఎపిసోడ్‌లో జరిగింది. స్కిట్‌లో సుధీర్ నంది కొమ్ముల మధ్యగా చూస్తే శివుడు కనిపించాల్సిన చోట “నాకు అమ్మవారు కనిపిస్తున్నారు” అని చెప్పడంతో ఆ సీన్ వైరల్ అయ్యింది. దీనిపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రవి, సుధీర్‌లపై మండిపడ్డాయి. దీంతో తాను తప్పుగా అర్థమయ్యేలా ప్రవర్తించానని అంగీకరించిన రవి, జై శ్రీరామ్, జై హింద్ అంటూ హిందువులకు క్షమాపణలు తెలిపారు. ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.