Site icon HashtagU Telugu

Anchor Rashmi : అందుకే యాంకర్ రష్మీకి సినిమా అవకాశాలు రావట్లేదట.. ఎమోషనల్ అయిన రష్మీ..

Anchor Rashmi emotional for not getting movies offers

Anchor Rashmi emotional for not getting movies offers

యాంకర్ రష్మీ(Anchor Rashmi )అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరికి తెలుసు. జబర్దస్త్(Jabardasth) షోతో ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది రష్మీ. ఎన్నో ఏళ్ళ క్రితం సినీ పరిశ్రమలోకి వచ్చినా, మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. చాలా స్ట్రగుల్ తర్వాత ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలో యాంకర్ గా అవకాశం రావడంతో వచ్చిన అవకాశాన్ని వాడుకొని సక్సెస్ అయింది. ఆ షోలో తన అందాలు ఆరబోస్తూ, తన కామెడీతో, డ్యాన్సులతో హడావిడి చేసి బాగా ఫేమస్ అయిపోయింది.

ఎక్స్‌ట్రా జబర్దస్త్ బాగా సక్సెస్ అవ్వడంతో ఢీ లాంటి మరిన్ని షోలలో కూడా హోస్ట్ చేసింది రష్మీ. ప్రస్తుతం ఎక్స్‌ట్రా జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో హోస్ట్ చేస్తోంది. టీవీ షోలకు వచ్చాక సినిమాలు ఆపేసినా మధ్యమధ్యలో హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది. రెచ్చిపోయి మరీ బోల్డ్ క్యారెక్టర్స్ లో కూడా నటించింది. కానీ ఎంత అందాలు ఆరబోసినా రష్మీకి వెండితెరపై మాత్రం ఆశించినంతగా అవకాశాలు రావట్లేదు.

ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో సీనియర్ నటి ఇంద్రజ, రష్మీని ఉద్దేశించి.. నువ్వు టీవీ లో సక్సెస్ అయ్యావు కానీ వెండితెరపై ఎందుకు సక్సెస్ కాలేకపోయావు, ఎందుకు సినిమా అవకాశాలు రావట్లేదు అని అడిగింది. దీనికి రష్మీ సమాధానమిస్తూ.. గతంలో సినీ పరిశ్రమలో నాకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ రాత్రికి రాత్రే నా ప్లేస్ లో వేరే వాళ్ళని తీసుకునే వారు. ఇక యాంకర్ గా సక్సెస్ అయ్యాక యాంకర్ గానే నన్ను గుర్తించి నటిగా పాత్రలు ఇవ్వట్లేదు. ఇండస్ట్రీలో అందరికి ఒక స్టాంప్ ఉంటుంది, వీళ్ళు ఆ పాత్రలకు మాత్రమే సరిపోతారు అని. అలాగే నన్ను కూడా అనుకోని సెకండ్ హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాత్రలు ఇస్తున్నారు. నేను యాంకర్ గా మాత్రమే సూట్ అవుతానని, సినిమాల్లో సెట్ అవ్వనని స్టాంప్ పడింది. అందుకే నాకు సినిమాల్లో అవకాశాలు రావట్లేదు. మొదట్లో ఈ విషయంలో బాధపడ్డాను. కానీ నాకు టెలివిజన్ మంచి సక్సెస్ ఇచ్చింది, దీన్ని మాత్రం వదులుకోను, సినిమాల్లో ఛాన్సులు వస్తేనే చేస్తాను అని ఎమోషనల్ అయింది. దీంతో రష్మీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి రష్మీకి ఇప్పటికైనా సినిమాల్లో మంచి పాత్రలు ఎవరైనా ఇస్తారేమో చూడాలి.

 

Also Read :  Aishwarya Rai : రెండు దశాబ్దాలుగా.. ప్రతి సంవత్సరం కాన్స్ లో ఐశ్వర్య రాయ్ హాజరు.. మొదటిసారి ఎప్పుడో తెలుసా??