Site icon HashtagU Telugu

Anchor Pradeep Machiraju: పవర్ స్టార్ టైటిల్‌తో యాంకర్‌ ప్రదీప్‌ కొత్త సినిమా

Pradeep Machiraju

Pradeep Machiraju

Anchor Pradeep Machiraju: బుల్లితెరపై యాంకర్‌గా మంచి పాపులారిటీ సాధించిన ప్రదీప్ మాచిరాజు, ఫీమేల్ యాంకర్లతో పోలిస్తే అనూహ్య క్రేజ్‌ను సంపాదించుకున్నారు. తన నటనపై ఉన్న ఆసక్తి కారణంగా “30 రోజులలో ప్రేమించడం ఎలా ” అనే చిత్రంతో హీరోగా వెండితెరపైకి ప్రవేశించారు. అయితే, ఈ సినిమా ప్రదీప్‌కు మంచి పేరు తెచ్చినా, అంచనాలను అందుకోలేకపోయింది.

ప్రస్తుతం, ప్రదీప్ తన రెండో చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాకోసం గత కొంతకాలంగా టీవీ షోల నుంచి దూరంగా ఉండి, పూర్తిగా సినిమాపై దృష్టి పెట్టాడు. ఈ చిత్రానికి “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” అనే టైటిల్ నిర్ణయించారు.

పవన్ కళ్యాణ్ నటించిన తొలి చిత్రానికి కూడా ఇదే టైటిల్ ఉండటం ప్రత్యేకం. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ మరియు మోషన్ పోస్టర్ గురువారం విడుదల చేశారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో యువతకు ఆకట్టుకునే ప్రేమకథను కూడా జోడించారు. డిసెంబరులో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.