Anchor Pradeep: ఓ మహిళా ప్రజాప్రతినిధితో యాంకర్ ప్రదీప్ మ్యారేజ్ జరగబోతోంది అంటూ ఇటీవలే ప్రచారం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఓ కుటుంబానికి చెందిన అమ్మాయితో ఆయనకు పెళ్లి జరుగుతుందని గతంలో టాక్ వినిపించింది. ఈ ప్రచారాలకు తెర వేసేలా యాంకర్ ప్రదీప్ సూటిగా సుత్తి లేకుండా క్లారిటీ ఇచ్చారు. దీంతో సస్పెన్స్‌కు తెరపడింది.
‘‘నేను ముందుగా జీవితంలో సెటిల్ కావాలని అనుకుంటున్నాను. నాకు కొన్ని డ్రీమ్స్, టార్గెట్స్ ఉన్నాయి. ముందు వాటిని సాధించాలని నిర్ణయించుకున్నాను. అవి కాస్త ఆలస్యం అయ్యాయి. దీంతో మిగిలిన విషయాలు కూడా కాస్త టైమ్ పడుతూ వచ్చాయి. కాకపోతే అన్నీ సరైన సమయానికే పూర్తవుతాయని నేను నమ్ముతున్నాను’’ అని యాంకర్ ప్రదీప్(Anchor Pradeep) పేర్కొన్నారు.
Also Read :Parimatch : పారిమ్యాచ్ కొత్త గేమ్‌లో కేంద్ర బిందువుగా సునీల్ నరైన్
త్వరలోనే క్రికెటర్‌తో..
‘‘నేను ఇంకా పెళ్లికి సంబంధించి ఏమీ ప్లాన్ చేసుకోలేదు. నా పెళ్లి గురించి వచ్చిన వార్తలు విన్నాను. ఈ ఏడాది చివరికల్లా ఓ రాజకీయ నాయకురాలితో నా పెళ్లి జరగబోతోందని అంటున్నారు. అంతకు ముందు రియల్ ఎస్టేట్ కుటుంబానికి చెందిన అమ్మాయితో నా పెళ్లి అన్నారు. త్వరలోనే క్రికెటర్‌తో మ్యారేజ్ అంటారేమో. అవన్నీ సరదా ప్రచారాలే. వాటిలో నిజం లేదు’’ అని యాంకర్ ప్రదీప్ స్పష్టం చేశారు.