Site icon HashtagU Telugu

Anchor Lasya : యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం.. లాస్య భర్త ఎమోషనల్ పోస్ట్..

Anchor Lasya Husband Manjunath Father Passed away

Anchor Lasya Husband Manjunath Father Passed away

Anchor Lasya : బుల్లితెరపై పలు టీవీ షోలలో యాంకర్ గా మెప్పించిన లాస్య కొన్నాళ్ళు పరిశ్రమకు దూరమైంది. ఆ తర్వాత పెళ్లి, పిల్లలు అంటూ లైఫ్ లో బిజీ అయిన లాస్య మళ్ళీ గత కొన్నాళ్లుగా యాక్టివ్ అయి టీవీ షోలలో పాల్గొంటుంది. యాంకరింగ్ చేయకపోయినా షోలలో పాల్గొంటూ, యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియాతో యాక్టివ్ గా ఉంటుంది.

యాంకర్ లాస్య మంజునాథ్(Manjunath) అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. తాజాగా లాస్య ఇంట విషాదం నెలకొంది. లాస్య భర్త మంజునాథ్ తండ్రి మరణించారు. మంజునాథ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

తన తండ్రితో దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. మీరు భౌతికంగా లేకపోయినా మీ ఆత్మ మాతోనే ఉంటుంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. మిస్ యు నాన్న అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసారు మంజునాథ్. దీంతో పలువురు నెటిజన్లు, ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తూ లాస్య కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు.

 

Also Read : Sonu Sood WhatsApp: యాక్టీవ్ మోడ్ లో సోనూసూద్ వాట్సాప్ అకౌంట్