Anchor Gayatri Bhargavi : యాంకర్ గాయత్రీ భార్గవి ఇంట్లో విషాదం..

ప్రముఖ యాంకర్ గాయత్రీ భార్గవి (Anchor Gayatri Bhargavi) ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తండ్రి సూర్య నారాయణ శర్మ (Surya Narayana Sharma Dies) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన తాజాగా తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్నీ యాంకర్ ఝాన్సీ (Anchor Jhansi) తన ఇన్ స్టాలో పేర్కొన్నారు. “గాయత్రీ భార్గవి తండ్రి మరణించారు.. ఆ వార్త నన్ను తీవ్రంగా కలచి వేసింది.. ఈ విషాదాన్ని తట్టుకునేలా.. […]

Published By: HashtagU Telugu Desk
Anchor Gayatri Bhargavi Fat

Anchor Gayatri Bhargavi Fat

ప్రముఖ యాంకర్ గాయత్రీ భార్గవి (Anchor Gayatri Bhargavi) ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తండ్రి సూర్య నారాయణ శర్మ (Surya Narayana Sharma Dies) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన తాజాగా తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్నీ యాంకర్ ఝాన్సీ (Anchor Jhansi) తన ఇన్ స్టాలో పేర్కొన్నారు. “గాయత్రీ భార్గవి తండ్రి మరణించారు.. ఆ వార్త నన్ను తీవ్రంగా కలచి వేసింది.. ఈ విషాదాన్ని తట్టుకునేలా.. భగవంతుడు ఆ కుటుంబానికి శక్తినివ్వాలి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని కోరుకుంటున్నాను” అంటూ ఝాన్సీ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో పాటు మరో పోస్ట్ లో ఈ ఏడాదిలో ముగ్గురిని పోగొట్టుకున్నాను అంటూ ఎమోషనల్ అయింది ఝాన్సీ. డాడీ, బడ్డీ, శ్రీను ఇలా ముగ్గురిని పోగొట్టుకున్నాను అంటూ ఝాన్సీ ఎమోషనల్ అవుతూ పోస్ట్ చేసింది. విషయం తెలిసిన అభిమానులు గాయత్రీకి ధైర్యంగా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.

గాయత్రీ పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించింది..ఎక్కువగా బుల్లితెరకే పరిమితమైన ఈమె యాంకర్ గా..నటిగానే కాకుండా సోషల్ మీడియా లోను యాక్టివ్ గా ఉంటూ నెటిజలను , ఫాలోయర్స్ ను అలరిస్తుంటుంది. ఇక ఈమె దర్శకుడు బాపు కు మనవరాలు. కానీ ఇది చాలామందికి తెలియదు. ఆమె సైతం బాపు పేరు చెప్పుకొని అవకాశాలు కోసం ట్రై చేయలేదు. తన టాలెంట్ గా ఛాన్సులు రాబట్టుకొని అలరిస్తూ వస్తుంది.

Read Also : Pallavi Prashanth : హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న పల్లవి ప్రశాంత్..?

  Last Updated: 27 Dec 2023, 02:36 PM IST