Site icon HashtagU Telugu

Pushpa 2: సమంతను మరిపించేలా.. పుష్ప2 లో అనసూయ స్పైసీ డాన్స్?

Anasuya

Anasuya

హాట్ యాంకర్ అనసూయ (Anasuya) తన అందాలతో మాత్రమే కాదు.. యాక్టింగ్ తోనూ అదరగొడుతోంది. “రంగస్థలం” సినిమాలో రంగమ్మత్త (Anasuya)గా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది. ఆ తర్వాత ఈ గ్లామరస్ యాంకర్ పలు సినిమాల్లోనూ నటించింది. సుకుమార్, అల్లు అర్జున్ (Allu arjun) కాంబినేషన్ లో వచ్చిన పుష్ప (Pushpa) సినిమాలోనూ అదరగొట్టింది అనసూయ. నెగిటివ్ పాత్రతో తనలోని యాక్టింగ్ ను బయటపెట్టింది. అయితే పుష్ప2లో అనసూయ కు ప్రాధాన్యం ఉంటుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా దర్శకుడు సుకుమార్ (Sukumar) అనసూయతో ‘ఊర నాటు’ డ్యాన్స్ సీక్వెన్స్ ప్లాన్ చేశాడని తెలుస్తోంది.

అయితే ఈ ప్రత్యేక పాటలో అనసూయ స్పైసీ లుక్స్ లో కనిపించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. పాన్ హీరోయిన్ సమంత పుష్ప-1 మూవీలో  స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఇక దేవీ కూడా పుష్ప2 (Pushpa2) కోసం కిర్రాక్ ఐటెం సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ అనసూయ (Anasuya) పై ఐటం సాంగ్ ప్లాన్ చేస్తే సమంతకు మించి ఉండవచ్చునని భావిస్తున్నారు అర్జున్ ఫ్యాన్స్. మరోవైపు, అల్లు స్టూడియోస్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో పుష్ప 2 షూటింగ్‌ను అల్లు అర్జున్ సుకుమార్ ప్రారంభించారు. ఆ తర్వాత మరో షెడ్యూల్ పారిన్ కంట్రీస్ వెళ్లనుంది పుష్ప2 టీం.

Also Read : Girls In Google: కొత్త పెళ్లికూతుళ్లు గూగుల్ లో ఏం సెర్చ్ చేస్తున్నారో తెలుసా!