Anasuya : జనసేన కోసం రెడీ అంటున్న అనసూయ..

ఒకవేళ జనసేన నుంచి ప్రచారం చేయమని అడిగితే తప్పకుండా వెళ్తాను. పవన్ కళ్యాణ్ మంచి లీడర్ కాబట్టి.. ఆయన పిలిస్తే నేను వెళ్తాను

Published By: HashtagU Telugu Desk
Anasuya Pawan

Anasuya Pawan

ఎన్నికలు (Elections) వస్తున్నాయంటే చాలు రాజకీయ నేతలే కాదు సినీ ప్రముఖులు (Cine Stars) సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దీనికి కారణం రాజకీయాలంటే ఇంట్రస్ట్ అని కాదు..పొలిటికల్ పార్టీ లకు ప్రచారం చేస్తే వచ్చే డబ్బు కోసం. రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి (Election Campaign ) సినీ గ్లామర్ ను యాడ్ చేస్తుంటారు. సినీ ప్రముఖులను చూసి జనాలు ఓట్లు వేస్తారని..అలాగే ప్రచారంలో పాల్గొంటారని చెప్పి రాజకీయ పార్టీలు సినీ ఆర్టిస్టులను ప్రచారంలోకి తీసుకొస్తారు. కాకపోతే అందరు ఆలా డబ్బు కోసం రారు..కొంతమంది పార్టీ సిద్ధాంతాలు , నేతలు నచ్చి ప్రచారం చేస్తుంటారు.

ముఖ్యంగా టిడిపి (TDP) కి మొదటి నుండి సినీ గ్లామర్ ఎక్కువ..సినీ స్టారే టీడీపీ పార్టీని స్థాపించడంతో మొదటి నుండి ఆ పార్టీ లో సినీ గ్లామర్ ఎక్కువ..ఆ పార్టీ లో చేరడం దగ్గరి నుండి ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు కూడా చాలామంది ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ఇక ఇప్పుడు త్వరలో జరగబోయే ఎన్నికల కోసం కూడా చాలామంది సినీ ప్రముఖులు రెడీ అవుతున్నారు. తాజాగా యాంకర్ , నటి అనసూయ (Anasuya) కూడా ప్రచారానికి రెడీ అని తెలిపింది. తాజా ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ.. ‘ఇది వివాదం అవ్వొచ్చు కానీ.. అడిగారు కాబట్టి చెప్తున్నా. నేను తప్పై ఉండొచ్చు. నాకు లీడర్స్‌తోనే పని. పొలిటికల్ పార్టీలతో కాదు. పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడు. ఆయన ప్రచారం చేయమని పిలిస్తే తప్పకుండా వెళ్తాను. జబర్దస్త్‌లో రోజా, నాగబాబు ఇద్దరితో కలిసి పనిచేశాను. నాకు నాగబాబు గారు బాగా క్లోజ్. ఒకవేళ అటు నుంచి రోజా గారూ.. ఇటు నుంచి నాగబాబు గారూ పార్టీలోకి పిలిస్తే.. నాకు నాయకులతోనే పని. పార్టీలతో పని కాదు. నాకు చాలా పార్టీల నుంచి చాలామంది లీడర్లు తెలుసు. వాళ్లని అభిమానిస్తాను. వాళ్లు ఇద్దరూ పిలుపునిస్తే.. ఆ రెండు పార్టీల్లోకి వెళ్తాను. అది నా ఆసక్తికిని బట్టి ఉంటుంది. కానీ అది నా జాబ్ కాదు. నేను ఏది నమ్ముతానంటే.. నా అజెండాని బట్టి నేను సపోర్ట్ చేస్తాను.

We’re now on WhatsApp. Click to Join.

నాకు రాజకీయాలంటే ఇష్టం లేదు. మా నాన్న గారు రాజకీయాల్లో ఉండేవారు. ఆయన పాలిటిక్స్ మానేయడానికి కారణం నేనే. కానీ నేను ఈ సొసైటీలో ఉంటున్నాను కాబట్టి.. మంచి లీడర్‌ని ఎన్నుకోవాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. మంచి లీడర్‌ని ఎన్నుకోమని నేనే వేరే వాళ్లకి చెప్పడం వాళ్లు నా వినడం అది నా అదృష్టం. నేను చెప్తే వింటారు కాబట్టి.. కరెక్ట్‌గా చెప్పాలి. నేను చెప్తే వింటారని ఏది పడితే అది చెప్పడం తప్పు. సినిమా అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఒకవేళ జనసేన నుంచి ప్రచారం చేయమని అడిగితే తప్పకుండా వెళ్తాను. పవన్ కళ్యాణ్ మంచి లీడర్ కాబట్టి.. ఆయన పిలిస్తే నేను వెళ్తాను. నేను వెళ్తే మాత్రం తెలుసుకునే వెళ్తాను’ అంటూ తన పొలిటికల్ ఎంట్రీ గురించి చెప్పుకొచ్చారు యాంకర్ అనసూయ.

Read Also : AP Elections 2024 : ఇప్పటి వరకు ఏపీలో కూటమి ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య ఎంతంటే..!!

  Last Updated: 27 Mar 2024, 11:02 PM IST