Anasuya: నేను తెలంగాణ బిడ్డనే.. సింపతి అక్కర్లేదు.. ఘాటుగా రియాక్ట్ అయిన అనసూయ?

తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ నటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనసూయ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. మొన్నటి వరకు యాంకర్ గా అలరించిన ఈమె ప్రస్తుతం నటిగా పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. ప్రస్తుతం చేతినిండా బోలెడు సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది రంగమ్మత్త. కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది అనసూయ. […]

Published By: HashtagU Telugu Desk
Anasuya

Anasuya

తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ నటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనసూయ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. మొన్నటి వరకు యాంకర్ గా అలరించిన ఈమె ప్రస్తుతం నటిగా పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. ప్రస్తుతం చేతినిండా బోలెడు సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది రంగమ్మత్త. కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది అనసూయ.

We’re now on WhatsApp. Click to Join
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటో షూట్ లను షేర్ చేయడంతో పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే విషయాలపై కూడా స్పందిస్తూ ఉంటుంది. తనకున్న అవగాహన మేరకు అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. ఇదే సమయంలో సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. కాగా గతంలో ఈమె విజయ్ దేవరకొండలో ఉద్దేశిస్తూ పరోక్షంగా నెట్టింట చాలా పోస్టులు చేసిన విషయం తెలిసిందే. విజయ్ అభిమానులు అనసూయ పై భారీగా ట్రోల్స్ చేశారు. అలా కొద్ది రోజులు పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వర్సెస్ అనసూయ అన్నట్టుగా కొద్ది రోజులు వార్ నడిచింది.

Also Read: Anupama Parameswaran: తల్లికి బర్త్డే విషెస్ చెప్పిన అనుపమ.. అత్తయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్?

వారికి ధీటుగా బదులిస్తూ అందరినీ తిప్పికొట్టింది. తన వెర్షన్ ను వినిపించడంలో ఏమాత్రం విఫలం కాలేదు. ఇక తాజాగా విజయ్ చేస్తున్న కామెంట్స్ పై ఓ నెటిజన్.. పీఆర్ మాఫియా లేపుతుందని, ఆ తర్వాత అనసూయ ఆంటీని దింపుతారనితన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అతనికి అనసూయ తాజాగా సాలిడ్ రిప్లై ఇచ్చింది..ఎందుకు అస్తమానం నన్ను లాగుతారు. ఎవరు ఏం మాఫియా చేస్తున్నారో నేను ఎప్పుడో చెప్పి వదిలేశాను. అనవసరంగా నేనే హైప్ చేస్తున్నానని నా వాళ్లు అంటుంటూనే నిజమేనేమో అని వదిలేశాను. నేను కూడా తెలంగాణ బిడ్డనే..నాకు సింపథి అక్కర్లేదు. నాకు నా మీద, నా దేవుడి మీద నమ్మకం ఉంది. మా అమ్మ నాన్నలు నాకిచ్చిన విలవులు, పెంపకం నన్ను నా దృష్టిలో ఎప్పుడు దిగజారనివ్వవు.. ఇప్పుడు ఈ ట్వీట్ ని కూడా తమ స్వార్ధానికి వాడుకున్నా కూడా నేను ఆశ్చర్యపోను.. కానీ నాకు ఇప్పుడు నేను కాదు లేదు అన్నట్టు.. నాకు తెలిసి మీరు నేను చుట్టాలం అస్సలు కాదండి. కాబట్టి నేను మీకు ఆంటీ కానేమో అంటూ బదులిచ్చింది. ఈ మేరకు అనసూయ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: Paiyaa Movie: 12 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కాబోతున్న తమన్నా సూపర్ హిట్ మూవీ.. అదేంటంటే?

  Last Updated: 05 Apr 2024, 12:47 PM IST