Site icon HashtagU Telugu

Anasuya: మరోసారి నెటిజన్స్ పై విరుచుకుపడిన అనసూయ.. మీ పని మీరు చూసుకోండంటూ?

Anchor Anasuya Bharadwaj Got Angry On Netizen

Anchor Anasuya Bharadwaj Got Angry On Netizen

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ నటి,యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల కాలంలో యాంకర్ అనసూయ భరద్వాజ్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ఈ మధ్యకాలంలో సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా హైలెట్అవుతోంది అనసూయ. మొన్నటికి మొన్న అనసూయ పై దారుణంగా చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేయడంతో ఆమె పోలీసులకు కంప్లైంట్ గట్టిగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి నెటిజన్స్ కి చురకలు అంటించింది అనసూయ. అసలేం జరిగిందంటే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన సిటాడెల్ ప్రొమోషన్స్ లో భాగంగా ఆమె స్త్రీ పురుష సమానత్వం గురించి మాట్లాడిన విషయం తెలిసిందే.

మహిళలు ఉద్యోగం చేస్తే కొంత మంది పురుషులు తట్టుకోలేకపోతున్నారని కానీ తన భర్త నిక్ ఎప్పుడూ తనని సపోర్ట్ చేస్తూనే ఉంటాడు అని ఆమె చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియోని అనసూయ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. ఆ వీడియోను షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది. నా ఉద్దేశం కూడా అదే.. ఇంట్లో కూడా ఒక టీం గా పనిచేయడం అవసరం. ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోవడం అర్థం చేసుకోవడం వంటి వాటితో ఇది సాధ్యమవుతుంది. కానీ దురదృష్టవశాత్తు కొన్ని కుటుంబాలలో ఇవి కనిపించడం లేదు. ఒకవేళ ఎవరైనా బతికినా వాళ్లపై ట్రూల్స్ చేస్తుంటాం కాబట్టి అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఈ ప్రపంచం అభివృద్ధి చెందుతుంది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ వారి పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అని రాసుకొచ్చింది అనసూయ.

అనసూయ చేసిన స్పందించిన నెటిజన్స్ వ్యంగంగా స్పందిస్తూ మేడం కుటుంబాన్ని పోషించే తన భార్యకు ఎలా వండి పెట్టాలో మీ పిల్లలకు ఇప్పటి నుంచే నేర్పించండి వచ్చే భార్య సంపాదిస్తుంది కాబట్టి ఇంటి పనులు ఎలా చక్క పెట్టాలో మీ పిల్లలకు చెప్పండి అని కామెంట్ చేశాడు. ఆ కామెంట్ కి అనసూయ రివర్స్లో కౌంటర్ ఇస్తూ తప్పకుండా నేర్పిస్తాను. మా 11 ఏళ్ల అబ్బాయి ఇప్పటికే వంట చేస్తున్నాడు. కిచెన్ లో నాకు సహాయం కూడా చేస్తూ ఉంటాడు. కుటుంబాన్ని పోషించడం కూడా నా పిల్లలకు ఇప్పటినుంచి నేర్పిస్తున్నాను. నా కుమారుడు అతనికి కాబోయే భార్య ఎలా జీవించాలి అనేది మీరు లేదా నేను నిర్ణయించడానికి కాదు. ఎందుకంటే వాళ్ళ జీవితం వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అందరి జీవితాల్లో జోక్యం చేసుకోవడం మన జీవితంపై ఫోకస్ చేయకపోవడం ఇదే కదా అసలు సమస్య.. కాబట్టి మీ పని మీరు చూసుకోండి అంటూ అనసూయ సున్నితంగా బదిలిస్తూనే చురకలు అంటించింది. వెంటనే ఆ నెటిజన్ ఆ ట్వీట్ ని డిలీట్ చేశాడు.